మ‌హేష్ క‌ళ్ల‌జోడు షాపు కొనిస్తాడ‌ట‌

స‌ముద్ర‌ఖ‌ని.. ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు. `అల వైకుంఠ‌పుర‌ములో`తో ఆయ‌న‌కు మంచి పేరు వ‌చ్చింది. ఇప్పుడు `స‌ర్కారు వారి పాట‌`లోనూ ఆయ‌నే విల‌న్‌. ఈ పాత్ర కోసం చాలామంది ప్ర‌ముఖుల పేర్లు ప‌రిశీలించారు. చివ‌రికి స‌ముద్ర‌ఖ‌ని ని ఎంచుకున్నారు. ఈ సినిమాలో స‌ముద్ర‌ఖ‌ని పాత్ర బాగా పండింద‌ని, స‌ర్కారు వారి పాట‌లో మేజ‌ర్ హైలెట్ అవుతుంద‌ని.. చిత్ర‌బృందం చెబుతోంది. మ‌హేష్ కూడా స‌ముద్ర‌ఖ‌ని గురించి గొప్ప‌గానే చెబుతున్నాడు. ఆయ‌న న‌ట‌న‌, సెట్లో ప్ర‌వ‌ర్త‌న బాగా న‌చ్చాయ‌ని కితాబు ఇస్తున్నాడు. అంతే కాదు.. త్వ‌ర‌లోనే ఆయ‌న‌కు క‌ళ్ల‌జోళ్ల షాపు కొనిస్తాడ‌ట‌.

ఎందుకంటే… స‌ముద్ర‌ఖ‌నికి క‌ళ్ల‌జోళ్ల సేక‌ర‌ణ బాగా అల‌వాటు. ఎక్క‌డైనా కొత్త త‌ర‌హా క‌ళ్ల‌జోడు చూస్తే… కొనేస్తార‌ట‌. ‘స‌ర్కారు వారి పాట‌’లో మ‌హేష్ వాడిన క‌ళ్ల‌జోళ్లు స‌ముద్ర‌ఖ‌నికి బాగా న‌చ్చాయ‌ట‌. అందుకే ‘మీరు వాడిన క‌ళ్ల‌జోడు ఒక‌టి ఇస్తారా.. మీ గుర్తుగా దాచుకుంటా’ అని అడిగాడ‌ట‌. ”నేను ఈ సినిమా చూశాను. ముఖ్యంగా స‌ముద్ర‌ఖ‌ని గారి న‌ట‌న‌కు ముగ్థుడ్ని అయ్యా. ఆయ‌న నన్నొక క‌ళ్ల‌జోడు అడిగారు. ఆయ‌న న‌ట‌న చూశాక‌.. ఒక‌టేంటి.. ఆయ‌న‌కోసం క‌ళ్ల‌జోళ్ల షాపే కొని ఇద్దామ‌నిపించింద‌”న్నాడు మ‌హేష్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అయితే “ఆదిపురుష్” బీజేపీ ప్రచార చిత్రం కాదన్న మాట !

ఆదిపురుష్ అనే సినిమాలో నటించడానికి ప్రభాస్ అంగీకరించినప్పటి నుండి చాలా మందికి ఆ సినిమాపై డౌట్స్ ఉన్నాయి. ఇటీవల కేటీఆర్ అది బీజేపీ ప్రచార చిత్రమని.. వచ్చే ఎన్నికలకు ముందు అయోధ్య...

మునుగోడుకు 86 మంది ఎమ్మెల్యేల్ని పంపుతున్న కేసీఆర్ !

మునుగోడులో టీఆర్ఎస్ తరపున ప్రచారం చేయడానికి తమ పార్టీకి ఉన్న 86 మంది ఎమ్మెల్యేల్ని పంపుతున్నారు. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించారు. ఒక్కో యూనిట్కి ఒక్కో ఎమ్మెల్యే ఇంచార్జ్గా ఉంటారని టీఆర్ఎస్...

డిజిట‌ల్‌లో ‘శివ‌’

ఈమ‌ధ్య రీ రిలీజ్‌ల హంగామా ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. పోకిరి, జ‌ల్సా, చెన్న‌కేశ‌రెడ్డి సినిమాలు రీ రిలీజ్ అయి భారీ వ‌సూళ్లు మూట‌గ‌ట్టుకొన్నాయి. త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ - బిల్లా కూడా రీ రీలీజ్ అవ్వ‌బోతోంది....

రీమేకుల‌పై మెగాస్టార్ మాట‌

చిరంజీవిపై ఓ విమ‌ర్శ బ‌లంగా వినిపిస్తుంటుంది. ఆయ‌న ఎక్కువ‌గా రీమేకుల‌పై ఆధార‌ప‌డ‌తాడ‌ని. రీ ఎంట్రీ గా వ‌చ్చిన ఖైదీ నెం.150 రీమేకే. రేపు విడుద‌ల‌య్యే గాడ్ ఫాద‌ర్ కూడా రీమేకే. ఇప్పుడు చేతిలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close