వైస్ ప్రిన్సిపాల్ స్టేట్‌మెంటే నారాయణ అరెస్ట్‌కు సాక్ష్యం !

టెన్త్ మాల్ ప్రాక్టీస్ కేసులో నారాయణ విద్యా సంస్థల ఫౌండర్ చైర్మన్ నారాయణను అరెస్ట్ చేశారు. అసలు ఎక్కడో వాట్సాప్‌లో ప్రశ్నాపత్రం షేర్ అయితే నారాయణకు ఏంటి సంబంధం.. ఎలా అరెస్ట్ చేస్తారనే డౌట్ రావడం సహజం. అక్కడ చిత్తూరు పోలీసులు తమదైన మెకానిజం చూపించారు. తిరుపతిలో టెన్త్ ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో షేర్ చేసిన వారిలో తిరుపతి నారాయణ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్ రెడ్డి ఉన్నారు. అయన దగ్గర నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు.,

మాజీ మంత్రి నారాయణ ప్రోద్భలంతోనే పేపర్‌ లీక్‌ చేసినట్లు ఆయన విచారణలో చెప్పారట. ప్రతీసారి పరీక్షలకు ముందు ఆయన విద్యా సంస్థల సిబ్బందితో సమావేశమై పేపర్లను లీక్ చేయాలని చెబుతారట. ఇలా గిరిధర్ రెడ్డి చాలా చెప్పారని.. అందుకే నారాయణ బండారం బయటపడిందని సజ్జల లాంటి వాళ్లు తీగ లాగేశామని చెబుతున్నారు. ఈ ఘటనలో మొత్తంగా చిత్తూరు వన్ టౌన్ పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు ప్రభుత్వ టీచర్లు ఉన్నారు. మిగిలిన వారు నారాయణ, శ్రీ చైతన్య, చైతన్య కృష్ణ రెడ్డి, ఎన్ఆర్‌ఐ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న వారు. ఆయా కాలేజీల చైర్మన్లను అరెస్ట్ చేశారో లేదో స్పష్టత లేదు.

నారాయణ రెండేళ్ల కింటే కాలేజీల నిర్వహణ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఆయన ప్రస్తుతానికి ఫౌండర్ చైర్మన్ మాత్రమే. నారాయణలో యాభై వేల మంది స్టాఫ్ ఉంటారు. రకరకాల హోదాలతో ఉన్నవారు ఉంటారు. వైస్ ప్రిన్సిపాల్ అంటే.. ఆయన కనీసం జోనల్ ఇంచార్జ్‌తో కూడా టచ్‌లో ఉండరు. అలాంటిది నేరుగా నారాయణతోనే డీల్ చేశారంటే ఎవరు నమ్ముతారు. కానీ పోలీసులు ఆ వాంగ్మూలం ఇచ్చారని నేరుగా నారాయణనే అరెస్ట్ చేశారు. వాంగ్మూలం సృష్టించుకున్నారన్న ఆరోపణలు వస్తాయని తెలిసినా వెనుకడుగు వేయలేదు.

నిన్నటి నుంచి హైకోర్టుకి వేసవి శెలవులు. వెకేషన్ బెంచ్ వారానికి ఒక్క రోజే అదీ గురువారం పని చేస్తుంది . మంగళవారం నాడు అప్లై చేస్తే బెంచ్ మీదకి గురువారం వస్తుంది. ఈ రోజు మంగళవారం కేస్ పెట్టి అరెస్టు చేశారు కాబట్టి అప్లై చేసుకోవడానికి కుదరదు. వచ్చే మంగళవారం దాకా ఆగాలి. అంటే కనీసం పది రోజుల దాకా జైల్లో ఉండాలి. న్యాయం అందుబాటులో ఉండని సమయం చూసి అరెస్టులు చూపిస్తున్నారని టీడీపీ నేతలంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close