మ‌హేష్‌తో క‌థ సెట్ కావ‌డం లేదా?

మ‌హేష్ బాబు – రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న సంగ‌తి తెలిసిందే. ఆర్‌.ఆర్‌.ఆర్ త‌ర‌వాత రాజ‌మౌళి చేయ‌బోయే సినిమా ఇదే. ఈలోగా స‌ర్కారువారి పాట‌, త్రివిక్ర‌మ్ సినిమాల్ని పూర్తి చేస్తాడు మ‌హేష్‌. ఈ కాంబినేష‌న్ ఇప్పుడు కుదిరినా, ఎప్ప‌టి నుంచో వార్త‌ల్లో ఉంది. రాజ‌మౌళితో సినిమా చేయాల‌ని మ‌హేష్‌కీ, మ‌హేష్‌తో ప‌ని చేయాల‌ని రాజ‌మౌళికీ గ‌ట్టిగానే ఉంది. అది ఇప్పుడు వ‌ర్క‌వుట్ అయ్యింది. మ‌హేష్ కోసం రాజ‌మౌళి జేమ్స్ బాండ్ లాంటి క‌థ త‌యారు చేశాడ‌ని ఎప్ప‌టి నుంచో చెబుతూనే ఉన్నారు. తాజాగా ఓ ఇంగ్లీష్ న‌వ‌ల హ‌క్కుల్ని ఈ సినిమా కోసం కొన్నార‌న్న వార్త‌లూ వ‌చ్చాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌హేష్ కోసం క‌థ సెట్ కాలేద‌న్న‌ది ఇన్‌సైడ్ వ‌ర్గాల టాక్‌.

రాజ‌మౌళి – మ‌హేష్‌ల మ‌ధ్య ఈ క‌థ‌కు సంబంధించి ప‌లుమార్లు చ‌ర్చ‌లు జ‌రిగాయి. రాజ‌మౌళి మూడు లైన్లు వినిపించాడు. అయితే అందులో ఏ ఒక్క‌టీ మ‌హేష్ కి సంతృప్తినివ్వ‌లేద‌ని తెలుస్తోంది. `మ‌న సినిమాకి ఇంకా టైమ్ ఉంది క‌దా… ఫ‌ర్లేదు మీరు కూడా టైమ్ తీసుకోండి. లేట్ అయినా ఫ‌ర్వాలేదు` అని మ‌హేష్ రాజ‌మౌళికి చెప్పాడ‌ని టాక్‌. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ గ‌త కొంత‌కాలంగా ఈ క‌థ‌పైనే వ‌ర్క్ చేస్తున్నారు. త్రివిక్ర‌మ్ తో సినిమా పూర్త‌వ్వ‌డానికి మ‌హేష్‌కి మ‌రో యేడాదైనా ప‌డుతుంది. సో.. 2022 చివ‌ర్లో రాజ‌మౌళి – మ‌హేష్ సినిమా మొద‌లు కావొచ్చు. ఈలోగా.. రాజ‌మౌళి ఓ బాలీవుడ్ సినిమా చేస్తార‌ని కూడా ప్ర‌చారం మొద‌లైంది. ఆ బాలీవుడ్ సినిమా అయ్యేలోగా క‌థ రెడీ చేసినా చాలు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రొమాంటిక్… రామ్ స్పెషల్!

ఆకాష్ పూరి రొమాంటిక్ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్లు చేరిపోతున్నాయి. పూరి స్వయంగా ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్ ప్లే రాశారు. శివగామి రమ్యకృష్ణ సినిమాలో కీలక పాత్ర చేసింది. ప్రభాస్ ఈ...

పూరికి కోట్ల పబ్లిసిటీ ఇచ్చిన ప్రభాస్ !

పూరి జగన్నాధ్ కి ప్రభాస్ చాలా పెద్ద సాయమే చేశాడు. రొమాంటిక్ సినిమా ప్రమోషన్స్ లో భాగస్వామి అయ్యాడు. ట్వీట్ చేయడమో, పోస్ట్ పెట్టడమో కాదు.. ఏకంగా ఒక ఫుల్ డే కాల్...
video

బాలయ్య మాటల్లో ఫిల్టర్ ఉండదు

https://youtu.be/nugtpLfdiD0 నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అలరించనున్నారు. ‘అన్‌స్టాపబుల్‌’ అనే ప్రోగ్రామ్ లో సందడి చేయనున్నారు. ‘ఆహా’ఓటీటీ లో ప్రసారంకానున్న ఈ షోకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ప్రోమోలో బాలకృష్ణ అదరగొట్టారు.''నీకు చిత్తశుద్ధి...

‘ఆర్‌ఎక్స్‌ 100’ కథ మారలేదు కానీ..

ఎలాంటి అంచనాలు లేకుండా సంచలనాలు నమోదు చేసిన చిత్రం 'ఆర్‌ఎక్స్‌ 100’. హీరోగా కార్తికేయ, హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్, దర్శకుడిగా అజయ్ భూపతికి ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చిపెట్టిన...

HOT NEWS

[X] Close
[X] Close