సంప‌త్‌నంది చేతికి రాజ‌మౌళి సినిమా

రీమేకులు, సీక్వెల్స్ జోలికి వెళ్ల‌ని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. త‌న సినిమాల్లో చాలా వాటికి సీక్వెల్స్ తీసేందుకు స‌రిప‌డ క‌థ‌లున్నాయి. కానీ… ఆ దిశగా రాజ‌మౌళి ఆలోచించ‌లేదు. కానీ విజ‌యేంద్ర ప్ర‌సాద్ మాత్రం `విక్ర‌మార్కుడు 2` క‌థ‌ని రెడీ చేసేశారు. ఈ సినిమా రాజ‌మౌళి చేసే అవ‌కాశాలు లేవు. అందుకే మ‌రో ద‌ర్శ‌కుడు కావాలి. అలా.. ఈ క‌థ సంప‌త్‌నంది చేతికి వెళ్లిన‌ట్టు టాలీవుడ్ టాక్‌. మాస్ క‌థ‌ల్ని తీయ‌డంలో సంప‌త్ స‌మ‌ర్థుడే. అలా… విక్ర‌మార్కుడు 2 క‌థ సంప‌త్ వ‌ర‌కూ వెళ్లి ఆగింది. ర‌వితేజ‌తో సంప‌త్‌నందికి ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో `బెంగాల్ టైగ‌ర్‌` వ‌చ్చింది. క‌మ‌ర్షియ‌ల్ గా ఆ సినిమా బాగానే ఆడింది. సో… ర‌వితేజ‌కీ… ఇప్పుడు అభ్యంత‌రం లేక‌పోవొచ్చు. `సిటీమార్‌`కి ఓపెనింగ్స్ బాగానే వ‌చ్చినా – చివ‌రి వ‌ర‌కూ నిల‌బ‌డ‌లేక‌పోయాయి. కాక‌పోతే.. సంప‌త్ స్టామినా అర్థ‌మైంది. దాంతో.. ఇప్పుడు మాస్ హీరోలు సంప‌త్ వైపు చూస్తున్నారు. సంప‌త్ నంది మెగా కాంపౌండ్ లో ఓ సినిమా చేస్తాడ‌ని గ‌ట్టిగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఏమ‌వుతుందో, సంప‌త్ నంది త‌రువాతి సినిమా ఏమిటో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘పుష్ప’లో రంగమ్మ మంగమ్మ మ్యాజిక్

https://www.youtube.com/watch?v=C70GJYVoZ4Y ''రంగస్థలం' లాంటి క్లాసిక్ తర్వాత సుకుమార్ చాలా గ్యాప్ తీసుకున్నారు. అల్లు అర్జున్ డేట్స్ దొరికేవరకూ వేరే ప్రాజెక్ట్ ముట్టుకోలేదు. చాలా హార్డ్ అండ్ గ్రౌండ్ వర్క్ చేసి ‘పుష్ప' ని సెట్స్...

బీ టౌన్ టాక్ : అల్లు అర్జున్ రాక్ స్టార్

అల్లు అర్జున్ పేరు బాలీవుడ్ న్యూస్ లో హాట్ టాపిక్ అయ్యింది. నిర్మాత కరణ్ జోహార్ అల్లు అర్జున్ ని రాక్ స్టార్ గా పిలిచారు. బుధవారం జరిగిన 'వరుడు కావలెను' ప్రీ...

వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయ ఇన్నింగ్స్ !?

హైదరాబాద్ వెరీ వెరీ స్పెషల్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనతో తాము ఇప్పటికే సంప్రదింపులు జరిపామని చేరేందుకు అంగీకరించారని అంటున్నారు. సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి,...

ఆఫీసర్ “మమత” అంటే మజాకానా ?

తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాల్లోని ముఖ్య నేతలు టీఆర్ఎస్‌లో చేరి పదవులు అందుకున్న తర్వాత ఉద్యోగ సంఘాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వం వచ్చింది. అలాంటి వారిలో టీజీవో అధ్యక్షురాలిగా ఉన్న మమత...

HOT NEWS

[X] Close
[X] Close