గూఢ‌చారిగా మ‌హేష్‌?

ఈమ‌ధ్య మ‌హేష్‌బాబు స్టైలీష్ క‌థ‌ల‌తోనే ఎక్కువ‌గా ప్ర‌యాణం చేస్తున్నాడు. శ్రీ‌మంతుడు, భ‌ర‌త్ అనే నేను, మ‌హ‌ర్షి… మొన్న‌టి `స‌రిలేరు నీకెవ్వ‌రు..` ఈ సినిమాల‌న్నీ ఈ కోవ‌లోకే వ‌స్తాయి. హెలీకాఫ‌ర్లు, చాప‌ర్లు ఎడా పెడా వాడేసేంత బిలియ‌నీర్ పాత్ర‌ల‌లోనే మ‌హేష్ క‌నిపిస్తున్నాడు. ఇప్పుడ మ‌రోసారి అలాంటి పాత్ర‌లోనే ద‌ర్శ‌న‌మివ్వ‌బోతున్నాడు.

మ‌హేష్ – వంశీ పైడిప‌ల్లి కాంబోలో ఓ సినిమా ప్రారంభం కానుంది. ఏప్రిల్‌, మేల‌లో చిత్రీక‌ర‌ణ మొద‌లెడ‌తారు. సాధార‌ణంగా… వంశీ పైడిప‌ల్లి సినిమాల‌న్నీ భారీ హంగుల‌తోనే ఉంటాయి. స్టైలీష్ మేకింగ్ అంటే వంశీకి ఇష్టం. ఈసారీ అలాంటి క‌థే రాసుకున్నాడ‌ని తెలుస్తోంది. మ‌హేష్ కోసం ఓ స్టైలీష్ స్పై థ్రిల్ల‌ర్ డిజైన్ చేశాడ‌ట‌. ఈ సినిమా హాలీవుడ్ జేమ్స్‌బాండ్ త‌ర‌హాలో సాగ‌బోతోంద‌ని తెలుస్తోంది. ఈ త‌ర‌హా పాత్ర‌లంటే మ‌హేష్‌కి చాలా ఇష్టం. కృష్ణ కూడా `జేమ్స్ బాండ్ త‌ర‌హా పాత్ర‌ల‌లో మ‌హేష్‌నిచూడాలి` అని త‌ర‌చూ చెబుతుండేవారు. `స్పైడ‌ర్‌`లో ఇలాంటి పాత్రే పోషించాడు మ‌హేష్‌. కానీ ఫ‌లితం రాలేదు. ఈసారి మాత్రం ప‌క్కా ప్లానింగ్‌తో, ప‌కడ్బందీగా రాబోతున్నాడు. అస‌లే వ‌రుస హిట్స్‌తో దూకుడుమీదున్నాడు మ‌హేష్‌. ఈసారి త‌న గురి త‌ప్ప‌క‌పోవొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కిసాన్ సమ్మాన్ కు కొర్రీలు..10 లక్షల మందికి సాయం బంద్..!?

రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రకటిస్తూనే అందుకు విరుద్దంగా మోడీ సర్కార్ వ్యవహరిస్తోంది. దేశవ్యాప్తంగా ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న కిసాన్ సమ్మాన్ కోతలకు గురి అవుతోంది. ఈ పథకానికి అనేక కొర్రీలు పెడుతూ...

‘ఆర్య‌’ వెనుక వినాయ‌క్‌

ప్రేమ క‌థ‌ల్లో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచిన సినిమా 'ఆర్య‌'. ఈ సినిమా విడుద‌లై 20 ఏళ్లు పూర్తయ్యింది. అయినా ఇప్పుడు చూసినా 'ఆర్య‌' కొత్త‌గానే క‌నిపిస్తుంది. దానికి కార‌ణం.. సుకుమార్ రైటింగ్‌, మేకింగ్‌....

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close