త్రివిక్ర‌మ్ పై అంత న‌మ్మ‌కం ఏమిటి?

మ‌హేష్ బాబు – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. అన్నీ అనుకొన్న‌ట్టు జ‌రిగితే… ఇప్ప‌టికి స‌గం సినిమా పూర్త‌య్యేది. కానీ.. ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఆల‌స్యం అవుతూ వ‌చ్చింది. న‌వంబ‌రులో షూటింగ్ మొద‌లుపెడ‌దామ‌నుకొంటే… మ‌హేష్ ఇంట్లో విషాదం చోటు చేసుకొంది. కృష్ణ ఆక‌స్మిక మ‌ర‌ణంతో.. మ‌హేష్ ఇంకొన్నాళ్లు షూటింగ్ కి దూరంగా ఉండాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. డిసెంబ‌రులో ఎట్టిప‌రిస్థితుల్లోనూ కొత్త షెడ్యూల్ మొద‌లు పెట్టాల‌న్న‌ది త్రివిక్ర‌మ్ ప్లాన్‌. మ‌హేష్ కూడా అదే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌. అంతే కాదు.. ఈ సినిమాని 2023 ఏప్రిల్ లో విడుద‌ల చేయాల‌ని ప్లాన్ కూడా చేస్తున్నార్ట‌.

అంటే..ఫిబ్ర‌వ‌రి మూడో వారంలో నాటికి షూటింగ్ అవ్వాలి. మార్చిలో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ తో పాటుగా, ప్ర‌మోష‌న్ల కార్య‌క్ర‌మం పూర్త‌వ్వాలి. మూడు నెల‌ల్లో సినిమాని లాగించేయ‌డం ఓకే. కాక‌పోతే… త్రివిక్ర‌మ్ అంత ఫాస్ట్ కాదు. పైగా… పెద్ద కాంబినేష‌న్ ఇది. అంద‌రి కాల్షీట్లూ స‌ర్దుబాటు కావాలి. మ‌ధ్య‌లో ఎలాంటి అవాంత‌రాలూ రాకూడ‌దు. వేస‌విలో షూటింగ్ చేయ‌డానికి మ‌హేష్‌కి మ‌న‌సొప్ప‌దు. ఏప్రిల్ లో ఎండ‌లు మొద‌లైపోతాయి కాబ‌ట్టి… మార్చిలోపే షూటింగ్ ముగించాల‌ని, ఏప్రిల్ లో ఎట్టిప‌రిస్థితుల్లోనూ సినిమా విడుద‌ల కావాల‌ని మ‌హేష్ ఒత్తిడి తీసుకొస్తున్న‌ట్టు తెలుస్తోంది. త్రివిక్ర‌మ్ కాస్త స్లో. మ‌హేష్ కూడా మ‌ధ్య‌మ‌ధ్య‌లో గ్యాప్ లు ఎక్కువ‌గా తీసుకొంటుంటాడు. మ‌రి ఏ న‌మ్మ‌కంతో.. ఏప్రిల్ లో ఈ సినిమాని విడుద‌ల చేయాల‌నుకొంటున్నారో వాళ్ల‌కే తెలియాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బాల‌య్య సినిమా చూసిన బ‌న్నీ

అల్లు కుటుంబానికీ బాల‌య్య‌కూ అనుబంధం ఈమ‌ధ్య బాగా బ‌ల‌ప‌డింది. ఆహాలో.. అన్ స్టాప‌బుల్ కి బాల‌య్య హౌస్ట్ గా రావ‌డం ద‌గ్గ‌ర్నుంచి ఈ బాండింగ్ స్ట్రాంగ్ అవ్వ‌డం మొద‌లైంది. అఖండ ప్రీ రిలీజ్‌కి...

‘ఖుషి’…. మ‌ళ్లీ మొద‌లు

స‌మంత అనారోగ్యంతో... `ఖుషి` సినిమాకి బ్రేకులు ప‌డిన సంగ‌తి తెలిసిందే. విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా ఇది. డిసెంబ‌రులో విడుదల కావాల్సింది. అయితే.. స‌మంత అనారోగ్యంతో షూటింగ్...

హిండెన్‌బర్గ్ రిపోర్ట్ దేశంపై దాడేనంటున్న అదానీ !

అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రిపోర్టుపై అదానీ గ్రూప్ చాలా ఆలస్యంగా అయినా ఎదురుదాడి ప్రారంభించింది. తాము వెల్లడించిన విషయాలు తప్పు అయితే తమపై దావా వేయాలని సవాల్ చేస్తున్నా... మూడు,...

ఏపీ సచివాలయ ఉద్యోగులకే అగ్నిపరీక్షలు – ఫెయిలయితే ?

ఏపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల్ని వర్గ శత్రువులుగా భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఏ విభాగ ఉద్యోగికి లేనన్ని ఆంక్షలు పెడుతోంది. నిబంధనలు అమలు చేస్తోంది. సచివాలయ ఉద్యోగాలన్నీ కార్యాలయంలో కూర్చుని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close