అఫీషియ‌ల్‌: చ‌ర‌ణ్‌తో బుచ్చిబాబు

ఉప్పెన‌తో సూప‌ర్ హిట్టు కొట్టాడు బుచ్చిబాబు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాని ప‌ట్టాలెక్కించ‌డానికి చాలా స‌మ‌య‌మే తీసుకొన్నాడు. ఎన్టీఆర్ తో బుచ్చి సినిమా ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. `పెద్ది` అనే క‌థ రెడీ చేశాడ‌ని కూడా అన్నారు. అయితే ఆ ప్రాజెక్టు… ముందుకు క‌ద‌ల్లేదు. ఎన్టీఆర్ కొర‌టాల శివ సినిమాని ఓకే చేయ‌డం వ‌ల్ల‌… బుచ్చి బాబు క‌థ‌ని ప‌క్క‌న పెట్టాల్సివ‌చ్చింది. అయితే.. ఆ త‌ర‌వాత బుచ్చి.. చ‌ర‌ణ్‌కి ట‌చ్‌లోకి వెళ్లాడు. రామ్ చ‌ర‌ణ్‌తో బుచ్చిబాబు సినిమా చేస్తాడ‌న్న ప్ర‌చారం ఈమ‌ధ్య ఊపందుకొంది. అయితే ఇది కూడా ఉంటుందా, లేదా? అనే అనుమానం కొంద‌రిలో వ్య‌క్త‌మయ్యింది.

ఎట్ట‌కేల‌కు ఈ సినిమాపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. చ‌రణ్ – బుచ్చిబాబుల కాంబినేష‌న్‌కి ఖ‌రారు చేస్తూ మైత్రీ మూవీస్ సంస్థ అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ ప్రాజెక్టులో సుకుమార్ కూడా భాగం కానున్నాడు. ఉప్పెన‌లోనూ సుకుమార్ హ్యాండ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి.. మైత్రీ-సుకుమార్ – బుచ్చిబాబు కాంబో సెట్ట‌య్యింది. అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది కాబ‌ట్టి.. ఇక బుచ్చి రిలాక్స్ అయిపోవొచ్చు. ఎన్టీఆర్ క‌థ‌నే కాస్త అటూ ఇటూ చేసి, చ‌ర‌ణ్‌కి సెట్ చేశాడా, లేదంటే చ‌ర‌ణ్ కోసం కొత్త క‌థ రాసుకొన్నాడా? అనేది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప సవాల్ – అవినాష్ రెడ్డిపై షర్మిల పోటీ !

కడప ఎంపీ బరి ఈ సారి ప్రత్యేకంగా మారనుంది. అవినాష్ రెడ్డిపై షర్మిల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. సునీత లేదా ఆమె తల్లి ఇండిపెండెంట్ గా లేదా టీడీపీ తరపున...

ఐదేళ్ల విలాసం తర్వాత ఎన్నికల ప్రచారానికే జనాల్లోకి జగన్ !

పదవి కోసం ప్రజల మధ్య పాదయాత్ర చేసిన జగన్ మోహన్ రెడ్డి .. అధికారం వచ్చాక విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. రెండు కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాఫ్టర్లను వాడారు. తన...

తుండు రివ్యూ: కాపీ కొట్ట‌డం ఎలా?

Thundu movie review ఈమ‌ధ్య మ‌ల‌యాళ చిత్రాల‌కు ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఓటీటీలు వ‌చ్చాక‌... ఆ భాష‌లో సినిమాల్ని స‌బ్ టైటిల్స్ తో చూసే బాధ త‌ప్పాక‌, తెలుగు డ‌బ్బింగులు పెరిగాక ఆ ప్రేమ మ‌రింత...

పాపం వైసీపీ – కోడ్ వచ్చాక పెయిడ్ సర్వేలూ ప్లేట్ ఫిరాయింంపు !

ఏపీలో జగన్ రెడ్డికి అంతా అనుకూలంగా ఉందని సర్వేలు వచ్చేలా.. మూడేళ్ల నుంచి చాలా పెద్ద బడ్జెట్ తో ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రయత్నాలు.. కోడ్ వచ్చాక పరువు తీస్తున్నాయి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close