మ‌హేష్ కోసం పౌరాణిక గాథ‌..!

టాలీవుడ్‌లో టాప్ హీరో.. మ‌హేష్‌బాబు. టాప్ ద‌ర్శ‌కుడు… రాజ‌మౌళి. వీళ్లిద్ద‌రి కాంబినేష‌న్ క‌లిస్తే – అదో సంచ‌ల‌న‌మే. మ‌హేష్ – రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. బాహుబ‌లి త‌ర‌వాత రాజ‌మౌళి టేక‌ప్ చేసే ప్రాజెక్ట్ ఇదే కావొచ్చు. దీనికి సంబంధించి రాజ‌మౌళి, మ‌హేష్ మ‌ధ్య చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి. రాజ‌మౌళితో ప‌నిచేయ‌డానికి మ‌హేష్ కూడా చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో ఎలాంటి సినిమారాబోతోంది? అన్న‌ది ఆస‌క్తిగా మారింది.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. ఇదో పౌరాణిక గాథ అని తెలుస్తోంది. ఇతిహాసాల్లోని ఓ వీరోచిత ఘ‌ట్టంతో ఈ సినిమా తెర‌కెక్క‌బోతోంద‌ట‌. మ‌హేష్ ఇప్ప‌టి వ‌ర‌కూ పౌరాణిక చిత్రం చేయ‌లేదు. ఒక వేళ చేస్తే.. అందుకు రాజ‌మౌళినే స‌రైన ద‌ర్శ‌కుడు అని భావిస్తున్నాడ‌ట‌. రాజ‌మౌళితో మహేష్ చేయ‌బోయే సినిమా ఓ విజువ‌ల్ వండ‌ర్‌గా ఉండ‌బోతోంద‌ని టాక్‌. ఇప్ప‌టికే… విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ మ‌హేష్ కోసం క‌థ రెడీ చేసే ప‌నిలో ప‌డ్డాడ‌ని తెలుస్తోంది. 2017 చివ‌ర్లో ఈ సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close