కొత్త కుర్రాడు సుమంత్ ప్రభాస్ తీసిన ‘మేమ్ ఫేమస్’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రీమియర్‌ను స్టార్ హీరో మహేశ్ బాబు చూశారు.సినిమా అద్భుతంగా ఉందంటూ చిత్రబృందాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.
‘‘మేము ఫేమస్’ సినిమా బ్రిలియంట్ గా ఉంది. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ వాళ్ల పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సుమంత్ ప్రభాస్ తన మల్టీ టాలెంట్‌తో సినిమాను చక్కగా తెరకెక్కించారు. విజవల్స్, మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. ఇంతమంది కొత్తవాళ్లు కలిసి ఈ సినిమా తీశారంటే నమ్మలేకపోతున్నా. మిమ్మల్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది’’ అంటూ చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
మహేశ్ ట్వీట్ కుడా చిత్ర నిర్మాతల్లో ఒకరైన శరత్ రీట్వీట్ చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. సుమంత్ ప్రభాస్ తో మరో సినిమా నిర్మిస్తున్నామని, దానికి జిఎంబీ నిర్మిస్తే మరింత ప్రోత్సాహంగా ఉంటుందని కోరారు. దానికి మహేష్ బాబు సరే అనే సమాధానం ఇవ్వడంతో మేమ్ ఫేమస్ టీం మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.