స్టార్ హీరోల‌వైపు శివ చూపు….

తొలి సినిమా ‘నిన్ను కోరి’తో ఆక‌ట్టుకున్నాడు శివ నిర్వాణ‌. ఆ వెంట‌నే త‌నకు మంచి ఛాన్సులు కూడా వ‌చ్చాయి. కొంత‌మంది స్టార్ హీరోల‌కు క‌థ‌లు వినిపించాడు. కానీ అవి ప‌ట్టాలెక్క‌లేదు. చివ‌రికి నాగ‌చైత‌న్య‌తో `మజిలీ` తీశాడు. ఈ సినిమాకి మంచి బ‌జ్ న‌డుస్తోంది. ప్ర‌చార చిత్రాలు బాగున్నాయి. బిజినెస్ కూడా సంతృప్తిక‌రంగానే జ‌రిగింది. అందుకే.. త‌దుప‌రి పెద్ద హీరోతోనే సినిమా చేయాల‌ని ఫిక్స్ అయ్యాడు. ‘మ‌జిలీ’ నిర్మాత‌లు ఇప్ప‌టికే మ‌రో సినిమా కోసం శివ‌కు అడ్వాన్స్ ఇచ్చారు. ఇప్పుడు శివ త‌న మూడో సినిమాని ఆ సంస్థ‌కే చేయాలి. త‌న‌కో పెద్ద హీరోను తీసుకొస్తే `మ‌జిలీ` విడుద‌లైన నెల రోజుల‌కే కొత్త సినిమాని ప‌ట్టాలెక్కిస్తాన‌ని అంటున్నాడ‌ట‌. ఇప్పుడు శివ కోసం పెద్ద హీరోని వెదికి ప‌ట్టుకొచ్చే బాధ్య‌త నిర్మాత‌ల‌దే. శివ చూపు బ‌న్నీ, ఎన్టీఆర్‌, విజ‌య్‌ దేవ‌ర‌కొండ లాంటి హీరోల‌పై ఉంద‌ని, వాళ్ల కోసం త‌గిన క‌థ‌ల్ని కూడా సిద్దం చేశాడ‌ని స‌మాచారం. “నా ద‌గ్గ‌ర రెండు క‌థ‌లు సిద్దంగా ఉన్నాయి. ఓ క‌థ వినోదాత్మ‌కంగా సాగుతుంది. రెండోది యాక్ష‌న్ క‌థ‌. హార‌ర్‌, థ్రిల్లర్ సినిమాలూ చేయాల‌నివుంది” అంటున్నాడు శివ‌. ‘మ‌జిలీ’ కూడా హిట్ట‌యిపోతే శివ‌కు హీరోలు సుల‌భంగానే దొరికేస్తారు. కాక‌పోతే.. ఇప్పుడున్న అగ్ర హీరోలంతా ర‌క‌ర‌కాల ప్రాజెక్టుల్ని సెట్ చేసుకుని వాటితోనే బిజీగా ఉన్నారు. శివ‌కు త‌న‌కు కావ‌ల్సిన రేంజ్ హీరో దొర‌కాలంటే కొంత కాలం ఎదురుచూడ‌క త‌ప్ప‌దు. ‘మ‌జిలీ’ ఫ‌లితం అటూ ఇటూ అయితే మాత్రం… దొరికిన‌వాళ్ల‌తో ఎడ్జస్ట్ అయిపోవాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేరళ ఎయిర్‌పోర్టులో విమానం రెండు ముక్కలు..!

కేరళలోని కోజికోడ్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ సమయంలో..విమానం స్కిడ్ అయి రెండు ముక్కలు అయింది. ఓ ముక్క చాలా దూరంగా పడిపోయింది. మరో ముక్క రన్ వే పై ఉండిపోయింది....

రికవరీ తక్కువ.. మృతులు ఎక్కువ..! ఏపీలో “డెడ్లీ” కరోనా..!

ఏపీలో కరోనా మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కరోనాతో 89 మంది చనిపోయారు. కేసులు కూడా.. మరోసారి పదివేలకు పైగా నమోదయ్యాయ. దీంతో ఏపీలో కరోనా బారిన...

మూడు నెలల్లో కొత్త జిల్లాల విభజన సిఫార్సులు..!

మూడు నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల సందడి ప్రారంభమవనుంది. గత కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు..రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ సర్కార్ ఆదేశాలు...

జేసీ ప్రభాకర్ రెడ్డి అండ్ సన్ మళ్లీ అరెస్ట్..!

గురువారం సాయంత్రమే కడప జిల్లా జైలు నుంచి విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. పాత కేసులేవీ అరెస్ట్ చేయడానికి లేకపోవడంతో... ...

HOT NEWS

[X] Close
[X] Close