హిట్ 2లో.. హిట్ 3 హీరో!

ఏ సినిమాకైనా ర‌న్ టైమ్ చాలా కీల‌కం. సినిమా బాగున్నా…. నిడివి పెరిగితే `బాబోయ్‌` అంటున్నారు. అందుకే ఈ విష‌యంలో ద‌ర్శ‌క నిర్మాత‌లు చాలా జాగ్ర‌త్త‌గా ఉంటున్నారు. సీన్లు ఎంత బాగున్నా – నిడివిని దృష్టిలో ఉంచుకొని క‌త్తెర్లు వేసుకొంటున్నారు. థ్రిల్ల‌ర్ చిత్రాలకు ర‌న్ టైమ్ మ‌రింత కీల‌కంగా మారుతోంది. ఈ క‌థ‌లు ఎంత షార్ప్ గా చెబితే అంత ఎక్కుతాయి. అందుకే `హిట్ 2` ర‌న్ టైమ్ విష‌యంలోనూ చిత్ర‌బృందం చాలా కేర్ తీసుకొంది. ఈ సినిమా ర‌న్ టైమ్ కేవ‌లం 2 గంట‌లు మాత్ర‌మే. అడ‌విశేష్ క‌థానాయ‌కుడిగా, నాని నిర్మాణంలో తెర‌కెక్కిన సినిమా ఇది. సెన్సార్ కూడా పూర్తయ్యింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి `ఏ` స‌ర్టిఫికెట్ అందించింది.

ఫ‌స్టాఫ్ అంతా చాలా ఆస‌క్తిక‌రంగా సాగింద‌ని, సెకండాఫ్‌లో ట్విస్ట్ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంద‌న్న‌ది సెన్సార్ రిపోర్ట్. హిట్ 1లో విశ్వ‌క్ సేన్ న‌టించాడు. హిట్ 2లో అడ‌విశేష్ క‌నిపించాడు. హిట్ 3లో హీరో మార‌బోతున్నాడు. ఆ హీరోని… హిట్ 2 క్లైమాక్స్ లో రివీల్ చేయ‌బోతున్నారు. ఇది కూడా ఇంట్ర‌స్టింగ్ ఎలిమెంటే. శైలేష్ కొల‌ను దర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని డిసెంబ‌రు 2న విడుద‌ల చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close