అనిల్ రావిపూడి – బాల‌య్య‌… ముహూర్తం ఫిక్స్‌

`ఎఫ్ 3` త‌ర‌వాత అనిల్ రావిపూడి సినిమా నంద‌మూరి బాల‌కృష్ణ తో ఫిక్సయిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కూ.. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌లేదు. దానికి రెండు కార‌ణాలున్నాయి. ఒక‌టి.. బాల‌య్య `వీర సింహారెడ్డి`తో బిజీగా ఉన్నాడు. రెండోది.. రావిపూడి కూడా స్క్రిప్టుని పూర్తి స్థాయిలో సిద్ధం చేయ‌లేదు. బాల‌య్య‌ సెకండాఫ్‌లో…కొన్ని మార్పులు చేర్పులూ సూచించ‌డంతో ఆ ప‌నిలో బిజీగా ఉండిపోయాడు. ఎట్ట‌కేల‌కు ఇప్పుడు స్క్రిప్టు సిద్ధమైంది. షూటింగ్‌కి కూడా ముహూర్తంది దొరికింది.

డిసెంబ‌రు 9 నుంచి… బాల‌య్య – రావిపూడి సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. బాల‌య్య కూడా 9నే.. సెట్లోకి అడుగుపెట్ట‌బోతున్నాడ‌ని టాక్‌. `వీర సింహారెడ్డి` సంక్రాంతికి విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి కావొచ్చింది. రావిపూడి సినిమాలో బాల‌య్య గెట‌ప్ కూడా స‌రికొత్త‌గా ఉండ‌బోతోంద‌ని టాక్‌. ఈ సినిమా పూర్తిగా బాల‌య్య స్టైల్ లోనే యాక్ష‌న్ మోడ్ లో ఉండ‌బోతోంద‌ట‌. అయితే రావిపూడి స్టైల్ ఆఫ్ కామెడీ కూడా మిక్స్ చేశాడ‌ట‌. మొత్తానికి బాల‌య్య ఫ్యాన్స్‌కి ఈ సినిమా విందుభోజ‌నంగా తీర్చిదిద్ద‌డానికి రావిపూడి అన్ని క‌స‌ర‌త్తులూ పూర్తి చేసేశాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జంధ్యాల స్టైల్‌లో `పేక మేడ‌లు`

'నా పేరు శివ', 'అంధగారం', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషించిన వినోద్ కిష‌న్ ఇప్పుడు హీరోగా మారాడు. ఆయ‌న న‌టించిన 'పేక మేడ‌లు' ఈనెల 19న విడుద‌ల‌కు సిద్ధంగా...

బీజేపీలో బీఆర్ఎస్ రాజ్యసభపక్షం విలీనం ?

బీఆర్ఎస్ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనం అయ్యేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లుగా ఢిల్లీలో ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరబోతున్నారు. ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఉపరాష్ట్రపతి,...
video

విజ‌య్ తెలివి.. ‘పార్టీ’ సాంగ్‌లో పాలిటిక్స్

https://www.youtube.com/watch?v=ygq_g7ceook త‌మిళ స్టార్ హీరో విజ‌య్ కొత్త‌గా పార్టీ స్థాపించిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే రాజ‌కీయ అరంగేట్రం చేయ‌బోతున్నాన‌ని, వ‌చ్చే త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు. రాజ‌కీయాల‌కు ముందు త‌న చివ‌రి...

పొన్నవోలు వాదన జగన్‌కైనా అర్థమవుతుందా ?

రఘురామ ఫిర్యాదుతో జగన్ తో పాటు ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కేసు నమోదయింది. ఇది తప్పుడు కేసు అని వాదించడానికి పొన్నవోలు మీడియా సమావేశం పెట్టారు. ఇందు కోసం తన టేబుల్ నిండా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close