కొరియోగ్రాఫ‌ర్‌ని హీరో చేస్తున్న దిల్ రాజు

ర‌చ‌యిత‌లు మెగాఫోన్ ప‌ట్ట‌డం ఎంత కామ‌నో… డాన్స్ మాస్ట‌ర్లు డైరెక్ట‌ర్లుగా, హీరోలుగా మార‌డం కూడా అంతే కామ‌న్‌. ప్ర‌భుదేవా, లారెన్స్‌, అమ్మ రాజ‌శేఖ‌ర్‌.. ఇలా హీరోలైన వాళ్లే. జానీ మాస్ట‌ర్ కూడా త్వ‌ర‌లోనే హీరోగా రాబోతున్నాడు. త‌న సినిమా ఇప్పుడు సెట్స్‌పై ఉంది. ఈలోగా మ‌రో డాన్స్ మాస్ట‌ర్ కెమెరా ముందుకు రావ‌డానికి రెడీ అయ్యాడు. త‌నే య‌ష్‌. ఈమ‌ధ్య కొన్ని హిట్ చిత్రాల‌కు కొరియోగ్ర‌ఫీ అందించాడు య‌ష్‌. ఇప్పుడు హీరో అవ‌తారం ఎత్త‌బోతున్నాడు. దిల్ రాజు సంస్థ‌లో ఈ చిత్రం రూపుదిద్దుకోవ‌డం విశేషం. శ‌శి అనే కొత్త ద‌ర్శ‌కుడ్ని వెండి తెర‌కు ప‌రిచ‌యం చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇదో రాక్ స్టార్ క‌థ అని తెలుస్తోంది. సంగీతానికీ, నృత్యానికీ ప్రాధాన్యం ఉంది. అందుకే య‌ష్‌ని హీరోగా ఎంచుకొన్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ జ‌రుపుకొంటోంది. త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి. దిల్ రాజు కొత్త ద‌ర్శ‌కుల‌తో, కొత్త హీరోల‌తో సినిమా తీశాడు కానీ, ఒకే సినిమాతో హీరోని, ద‌ర్శ‌కుడ్నీ ప‌రిచ‌యం చేయ‌డం ఇదే తొలిసారి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిండెన్‌బర్గ్ రిపోర్ట్ దేశంపై దాడేనంటున్న అదానీ !

అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రిపోర్టుపై అదానీ గ్రూప్ చాలా ఆలస్యంగా అయినా ఎదురుదాడి ప్రారంభించింది. తాము వెల్లడించిన విషయాలు తప్పు అయితే తమపై దావా వేయాలని సవాల్ చేస్తున్నా... మూడు,...

ఏపీ సచివాలయ ఉద్యోగులకే అగ్నిపరీక్షలు – ఫెయిలయితే ?

ఏపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల్ని వర్గ శత్రువులుగా భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఏ విభాగ ఉద్యోగికి లేనన్ని ఆంక్షలు పెడుతోంది. నిబంధనలు అమలు చేస్తోంది. సచివాలయ ఉద్యోగాలన్నీ కార్యాలయంలో కూర్చుని...

మరో అంతర్జాతీయ సదస్సుకు కేటీఆర్‌కు ఆహ్వానం !

కేటీఆర్ నాయకత్వ లక్షణాలు.. ఆయన విజన్.. చేస్తున్న అభివృద్ధి అంతర్జాతీయంగా పేరు తెచ్చి పెడుతోంది. మరో అంతర్జాతీయ సమావేశాలకు ఆహ్వానం అందింది. అమెరికా హెండర్సన్‌లో జరగనున్న పర్యావరణ-జలవనరుల సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు....

పొత్తుండని టీడీపీ చెప్పకపోవడమే ఏపీ బీజేపీ నేతలకు అలుసైందా ?

ఏపీ బీజేపీ నేతలు ముఖ్యంగా ప్రో వైసీపీ గ్యాంగ్ గా ప్రసిద్ధి చెందిన సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలు పదే పదే టీడీపీతో పొత్తులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close