ఫ్రాన్స్ వెళ్తున్న చిరు

వాల్తేరు వీర‌య్య షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో జ‌రుగుతోంది. సంక్రాంతికి ఈ సినిమాని విడుద‌ల చేయ‌నున్నారు. డిసెంబ‌రు 15 నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేయాల‌న్న‌ది ప్లాన్‌. ఇటీవ‌లే ఓ పాట‌ని కూడా విడుద‌ల చేశారు. మ‌రో స‌ర్‌ప్రైజ్ కూడా త్వ‌ర‌లోనే ప్లాన్ చేస్తున్నారు. ఈలోగా.. రెండు పాట‌ల చిత్రీక‌ర‌ణ నిమిత్తం.. వాల్తేరు వీర‌య్య టీమ్ ప్రాన్స్ వెళ్తోంది. డిసెంబ‌రు 1న చిరు ఫ్రాన్స్‌లో ఉంటారు. అక్క‌డ ఓ ప‌ది రోజుల పాటు షూటింగ్ జ‌ర‌గ‌నుంది. తిరిగొచ్చాక ప్యాచ్ వ‌ర్క్ పూర్తి చేస్తారు. డిసెంబ‌రు చివ‌రి వారం నుంచి ప్ర‌మోష‌న్లు మొద‌లు పెడ‌తారు. ఈ సినిమాలో ర‌వితేజ కూడా ఓ కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌వితేజ‌కు సంబంధించిన షూటింగ్ పార్ట్ దాదాపుగా పూర్త‌యిన‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల `వాల్తేరు వీర‌య్య‌` నుంచి `బాస్ పార్టీ` పేరుతో ఓ పాట విడుద‌ల చేశారు. ఆ పాట‌కు మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది. ఈసారి.. రెండో పాట దుమ్ము దులిపి, అసంతృప్తుల్ని చెరిపివేసేలా ఉండాలి. ఈ విష‌యంలో దేవిశ్రీ పై ఒత్తిడి పెరిగిన మాట వాస్త‌వం. మ‌రి రెండో పాటైనా అల‌రిస్తుందో, లేదో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిండెన్‌బర్గ్ రిపోర్ట్ దేశంపై దాడేనంటున్న అదానీ !

అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రిపోర్టుపై అదానీ గ్రూప్ చాలా ఆలస్యంగా అయినా ఎదురుదాడి ప్రారంభించింది. తాము వెల్లడించిన విషయాలు తప్పు అయితే తమపై దావా వేయాలని సవాల్ చేస్తున్నా... మూడు,...

ఏపీ సచివాలయ ఉద్యోగులకే అగ్నిపరీక్షలు – ఫెయిలయితే ?

ఏపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల్ని వర్గ శత్రువులుగా భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఏ విభాగ ఉద్యోగికి లేనన్ని ఆంక్షలు పెడుతోంది. నిబంధనలు అమలు చేస్తోంది. సచివాలయ ఉద్యోగాలన్నీ కార్యాలయంలో కూర్చుని...

మరో అంతర్జాతీయ సదస్సుకు కేటీఆర్‌కు ఆహ్వానం !

కేటీఆర్ నాయకత్వ లక్షణాలు.. ఆయన విజన్.. చేస్తున్న అభివృద్ధి అంతర్జాతీయంగా పేరు తెచ్చి పెడుతోంది. మరో అంతర్జాతీయ సమావేశాలకు ఆహ్వానం అందింది. అమెరికా హెండర్సన్‌లో జరగనున్న పర్యావరణ-జలవనరుల సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు....

పొత్తుండని టీడీపీ చెప్పకపోవడమే ఏపీ బీజేపీ నేతలకు అలుసైందా ?

ఏపీ బీజేపీ నేతలు ముఖ్యంగా ప్రో వైసీపీ గ్యాంగ్ గా ప్రసిద్ధి చెందిన సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలు పదే పదే టీడీపీతో పొత్తులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close