ల్యాండ్ ఇష్యూ… మల్లారెడ్డి వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ మధ్య భూపంచాయితీ హాట్ టాపిక్ గా మారింది. ఈ భూమి మాదంటే మాదేనని ఇద్దరూ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని అటు మల్లారెడ్డి చెప్తుండగా.. తమ దగ్గర కూడా ప్రూఫ్స్ ఉన్నాయని అడ్లూరి లక్ష్మణ్ చెబుతుండటంతో ఈ ఇష్యూ కాస్త సీఎం వద్దకు చేరనున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలోని సుచిత్రలో సర్వే నెంబర్ 82కు సంబంధించి రెండున్నర ఎకరాల భూమిపై మల్లారెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ ల మధ్య వివాదం నెలకొంది. తమ భూమిలో అక్రమంగా ఫెన్సింగ్ వేశారంటూ మల్లారెడ్డి వర్గీయులు ఇటీవల కంచెను కూల్చడం ఘర్షణకు దారితీసింది. ఈ భూమిని పదిహేనేళ్ళ కిందటే కొనుగోలు చేసినట్లు మల్లారెడ్డి చెబుతున్నారు. తన దగ్గర ఉన్న ల్యాండ్ డాక్యుమెంట్స్ ఫేక్ అని నిరూపిస్తే, ఎమ్మెల్యే పదవికి రాజేనేమా చేస్తానని మల్లారెడ్డి సవాల్ విసరడంతో ఈ ఇష్యూ మరింత హీట్ పెంచింది. కాంగ్రెస్ పార్టీ తమపై తప్పదు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.

ఈ అంశంపై స్పందించిన అడ్లూరి లక్ష్మణ్.. తనతోపాటు ఆరుగురు కలిసి 2015లో ఈ భూమిన్ని కొనుగోలు చేశామని ఆయన స్పష్టం చేస్తున్నారు. ల్యాండ్ పై వివాదం ఉండటంతో మల్లారెడ్డి, ఆయన అల్లుడిని కలిసి సెటిల్ చేయాలని అడిగితే పట్టించుకోలేదన్నారు. మల్లారెడ్డి కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తూ కబుర్ల చెప్పడం కాదు.. ముఖ్యమంత్రి వద్ద తన నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్ విసరడంతో మల్లారెడ్డి ఎలా వ్యవహరిస్తారు..? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఈ ల్యాండ్ ఇష్యూపై మల్లారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ భూమి మాదేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కూడా చెబుతుండటంతో రేవంత్ ఈ వివాదానికి ఎలా ఫుల్ స్టాప్ పెడుతారన్నది ఉత్కంఠ రేపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తీహార్‌ జైల్లో కవితను కలిసిన కేటీఆర్

తీహార్ జైల్లో ఉన్న కవితతో చాలా రోజుల తర్వాత కేటీఆర్ ములాఖత్ అయ్యారు. మార్చి 15న కవితను హైదరాబాద్ లో ఈడీ అధికారులు అరెస్టు చేసిన తర్వాత ఆమె కోసం...

సజ్జల ప్లేస్‌లో ఉండవల్లి కరెక్ట్ !

అబ్బా..అబ్బా.. ఏం మోటివేషన్ అండి. ఆయన గారు కార్పొరేట్ మోటివేషనల్ స్పీకర్ గా వెళ్తే ఆయన ఎక్కించే హైప్‌కి ఐటీ ఉద్యోగులు గాల్లో తేలిపోతారు. కానీ జగన్ రెడ్డికి ఎలా ఉందో ...

గురి తప్పిన ట్వీట్… వైసీపీ ప్లాన్ బూమరాంగ్!

ఎన్నికల్లో ఘోర పరాజయంతో పార్టీ మనుగడనే ప్రశ్నార్ధకం చేసుకున్న వైసీపీ... సోషల్ మీడియా పుణ్యమా అని తన గోతిని తనే తవ్వి తీసుకుంటున్నట్లు కనబడుతోంది. కూటమి సర్కార్ ను టార్గెట్ చేయబోయి తన...

టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీ‌నివాస్

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ ను నియమించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతోన్న అచ్చెన్నాయుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన స్థానంలో పల్లాకు పార్టీ పగ్గాలు అప్పగించినట్లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close