మల్లాది విష్ణు సోదరులు అరెస్ట్

కల్తీ మద్యం కేసులో నిందితులుగా పేర్కొనబడిన విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు, ఆయన తమ్ముడు మల్లాది శ్రీనివాస్ లను నిన్న రాత్రి విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసారు. మల్లాది విష్ణుతో సహా స్వర్ణా బార్ అండ్ రెస్టారెంట్ తో సంబంధం ఉన్న ఆయన కుటుంబ సభ్యులందరినీ నిన్న కృష్ణ లంక పోలీస్ స్టేషన్లో మాహేష్ చంద్ర లడ్హా నేతృత్వంలో ఏర్పాటు చేయబడిన సిట్ అధికారులు విచారించారు. స్వర్ణా బార్ అండ్ రెస్టారెంట్ తో తనకు ఎటువంటి సంబంధమూ లేదని మల్లాది విష్ణు నిన్న కూడా వాదించినట్లు తెలుస్తోంది. మల్లాది విష్ణు చెప్పిన సమాధానాలు మిగిలినవారు చెప్పిన సమాధానాలకు పొంతన లేకపోవడంతో మల్లాది విష్ణు సోదరులను పోలీసులు నిన్న అర్ధ రాత్రి అరెస్ట్ చేసారు. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతోనే మల్లాది విష్ణు గత నెలరోజులుగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కానీ చివరికి అరెస్ట్ కాక తప్పలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]