ముందుగానే బడ్జెట్ సమావేశాలు? – జి ఎస్ టి పై వెంకయ్య లాబీయింగ్!

జి ఎస్ టి (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) లో మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలు ఎక్కువ వున్న రాష్ట్రాలపై విధించాలనుకున్న అదనపు పన్నుని తొలగించాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయం వివరించి జిటిఎస్ బిల్లుకి రాజ్యసభలో కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని కోరడానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకున్నారు.

జిఎస్‌టి బిల్లును కాంగ్రెస్‌ సమర్థించే పక్షంలో బడ్జెట్‌ సమావేశాలను ముందుగానే ప్రారంభిద్దామని వెంకయ్య సోనియాకు సూచించినట్టు చెబుతున్నారు.

జీఎస్‌టి బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే ఎక్సైజ్‌సుంకం, సేవలపన్ను, అమ్మకపు పన్నుల స్థానే ఏకపన్ను వ్యవస్థ అమల్లోకి వస్తుంది. అంతర్జాతీయం, జాతీయ వాణిజ్యరంగం భారత దేశంలో ఆర్థిక సంస్కరణలు వేగవంతంగా అమలు కావాలని డిమాండ్ స్ధాయిలో కోరుతున్నాయి. ఇందుకు ఆధారం కాగల జిఎస్‌టి బిల్లును అమలులోకి తీసుకురావాలని కేంద్రం పట్టుదలతో ఉంది. అయితే బిజెపికి రాజ్యసభలో తగినంత మెజారిటీ లేకపోవడంతో ఈ బిల్లు చట్టకాలేదు. శీతాకాల సమావేశాల్లో జిఎస్‌టి బిల్లును పాస్‌ చేసేందుకు కేంద్రం చేసిన యత్నాలు ఫలించలేదు. దీంతో బడ్జెట్‌ సమావేశాల్లోనైనా జిఎస్‌టి బిల్లును గట్టెక్కించేందుకు కేంద్రం మళ్లీ ప్రయత్నాలు మొదలెట్టింది.

జిఎస్‌టి బిల్లు కి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. జిఎస్‌టి బిల్లులో మూడు అంశాల్లో మార్పులు చేయాలని కేంద్రానికి సూచిస్తోంది. మూడింటిలో రెండింటికైనా ఆమోదం తెలిపి కాంగ్రెస్‌ను సంతృప్తి పరచే పనిలో కేంద్రం ఉంది.

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి ఆఖరు వారంలో ప్రారంభమౌతాయి. జిఎస్‌టి బిల్లుపై కాంగ్రెస్‌తో కేంద్రానికి అవగాహన కుదిరితే బడ్జెట్‌ సమావేశాలు ముందే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. జిఎస్‌టితో పాటు మరికొన్ని కీలక బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. బిజెపికి మెజారిటి ఉండడంతో లోక్‌సభలో బిల్లులు ఆమోదం పొందినా రాజ్యసభలో విపక్షాల ఆధిపత్యం కారణంగా పలు బిల్లులు పాస్‌ కాలేక పోతున్నాయి. మిగిలిన బిల్లులు ఎలావున్నా ఏప్రిల్ 1 నుంచి ఏకీకృత పన్ను విధింపు అమలు చేయాలన్న పట్టుదలతో జిఎస్‌టి బిల్లును ఆలోగానే చట్టం చేయాలని భావిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close