మంచు మ‌నోజ్ రీ ఎంట్రీ

ఆల్ రౌండ‌ర్ అనిపించుకొన్న హీరో మంచు మ‌నోజ్‌. త‌న సినిమాల్లో యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ త‌నే చేస్తాడు. పాట‌లు పాడ‌తాడు. రాస్తాడు. ప్రొడ‌క్ష‌న్ బాధ్య‌త‌లూ చూసుకుంటాడు. మాస్ క‌థ‌ల‌కు స‌రిగ్గా స‌రిపోతాడు. కానీ కొన్నేళ్లుగా మ‌నోజ్ నుంచి సినిమాలు రావ‌డం లేదు. త‌న‌కీ సినిమాల‌పై ఆస‌క్తి త‌గ్గింద‌న్న కామెంట్లు వినిపించాయి. కొన్ని ప్రాజెక్టులు ప్ర‌క‌టించినా – అవి సెట్స్‌పైకి వెళ్ల‌లేదు. అంతెందుకు… మ‌నోజ్ మీడియాకి క‌నిపించే చాలా కాల‌మైంది. ఎట్ట‌కేల‌కు మ‌నోజ్ మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు.

అహం బ్ర‌హ్మ‌స్మి అనే ఓ పాన్ ఇండియా ప్రాజెక్టు ప్ర‌క‌టించాడు మ‌నోజ్‌. ఆ త‌ర‌వాత క‌రోనా వ‌చ్చింది. ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పుడు మ‌ళ్లీ అదే సినిమాని పట్టాలెక్కించ‌బోతున్నాడ‌ట‌. లాక్ డౌన్ కి ముందే మ‌నోజ్ బాగా లావైపోయాడు. కొన్ని నెల‌లుగా త‌న బ‌రువు త‌గ్గించుకొనే ప‌నిలో త‌ల‌మున‌క‌లై ఉన్నాడ‌ని టాక్. నేను మీకు తెలుసా, మిస్ట‌ర్ నోకియా సినిమాల్లో ఎంత స‌న్న‌గా ఉన్నాడో, ఇప్పుడు అలా త‌యార‌వ్వ‌బోతున్నాడ‌ట‌. అందుకే మీడియా ముందుకూ రావ‌డం లేద‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే త‌న రీ ఎంట్రీ గురించి ప్ర‌క‌టించ‌బోతున్నాడ‌ని, ఈలోగా ఫిట్ అయ్యే ప‌నిలో బిజీగా ఉన్నాడ‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సాలు .. సాలంటున్న బీజేపీ, టీఆర్ఎస్ !

సొలు దొర - సెలవు దొర అని బీజేపీ అంటూంటే... సాలు మోదీ.. సంపకు మోదీ అని టీఆర్ఎస్ రివర్స్ కౌంటర్ ఇస్తోంది. తమ పార్టీ ఆఫీస్ ముందు డిజిటల్ బోర్డు...

చివరికి కుప్పానికి విశాల్ రెడ్డిని కూడా పిలుస్తున్నారు !

కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామంటున్న వైసీపీకి దారి తెలుస్తున్నట్లుగా లేదు. మున్సిపల్ ఎన్నికల్లో చేసినట్లుగా అసెంబ్లీ ఎన్నికల్లో చేయలేమని అర్థమైందేమో కానీ ఇప్పుడు సినీ హీరోను చంద్రబాబుపై పోటీకి పెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారు. తమిళ...

ఏపీలో అధికారులు ఎవరైనా “కథలు” చెప్పాల్సిందే !

దొంగ లెక్కలు రాయడం.. తప్పుడు కథలు చెప్పడం ఇప్పుడు ఏపీ అధికారులకు ఓ కామన్ ప్రాక్టిస్ అయిపోయింది. పోలీసులు వివిధ కేసుల్లో చెప్పిన కథలు వారిని నవ్వుల పాలు చేశాయి. సోషల్...

దర్శి ఎమ్మెల్యే చెప్పుకున్నారు.. మిగతా వాళ్లు మనసులో దాచుకుంటున్నారు !

గడప గడపకూ వెళ్తే ప్రజలు నిలదీస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ కి చెందిన దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్‌సీపీ నియోజకవర్గ ప్లీనరీలో మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close