నెరవేరిన నాని కల

హైదరాబాద్: మణిరత్నం చిత్రంలో నటించటం తన కల అని నాని ఎప్పుడూ చెబుతుంటారు. ‘ఓకే బంగారం’ చిత్రంలో హీరో దుల్కర్ సల్మాన్ పాత్రకు డబ్బింగ్ చెప్పమని అడిగితేనే ఆనందంగా ఒప్పుకున్నారు. ఇక ఆయన చిత్రంలో హీరో పాత్ర అవకాశం వస్తే నాని పరిస్థితి ఎలా ఉంటుందో.

కార్తి, దుల్కర్ హీరోలుగా తమిళం, తెలుగు భాషలలో తాను రూపొందిస్తున్న చిత్రంనుంచి మణిరత్నం దుల్కర్‌ను తొలగించినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ పాత్రలో నానిని బుక్ చేసుకున్నట్లు తేలింది. దుల్కర్‌కు తెలుగులో కార్తికి ఉన్నట్లుగా మార్కెట్‌ లేనందున అతను వద్దని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌లుకూడా మణిరత్నానికి సూచించారట. మరోవైపు నానికి తమిళం, తెలుగు భాషలు రెండింటిలో మార్కెట్ ఉండటంతో దుల్కర్‌కు ప్రత్యామ్నాయంగా అతనిని తీసుకోవటానికి మణిరత్నం డిజైడ్ అయ్యారట. ఈ చిత్రంలో హీరోయిన్‌లుగా నిత్య మీనన్, కీర్తి సురేష్ నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే భలే భలే మగాడివోయ్ చిత్రం సక్సెస్ మీట్‌ను అమెరికాలో జరుపుకుని తిరిగొచ్చిన నాని, మీడియాతో మాట్లాడుతూ ఈ చిత్రం ఇంత విజయం సాధిస్తుందని తానుకూడా ఊహించలేదని చెప్పారు. అమెరికాలో తెలుగు చిత్రాలలో టాప్ టెన్‌లో ఇది స్థానం సంపాదించుకుందని, ఏడవ స్థానంలో నిలిచిందని తెలిపారు. ప్రీ ప్రమోషన్ చిత్రం విజయానికి కీలకమని అన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ అభిమానిగా నటిస్తున్న చిత్రం షూటింగ్ కొనసాగుతోందని, దీనికి కూడా ప్రీ ప్రమోషన్ బాగా చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దటీజ్ పవన్ – ముద్రగడకు గౌరవం !

కుటుంబాల్లో చిచ్చు పెట్టడం వైసీపీ రాజకీయవ్యూహంలో ఒకటి. రామోజీరావు కుటుంబం నుంచి దేవినేని ఉమ కుటుంబం వరకూ ఎక్కడ చాన్స్ వచ్చినా వదిలి పెట్టలేదు. కానీ జనసేన చీఫ్ పవన్...

జగన్‌పై సీఐడీ కేసు పెట్టక తప్పదా !?

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారని మల్లాది విష్ణు ఫిర్యాదు చేస్తే వెంటనే సీఐడీలోని ఫలానా అధికారి విచారించాలని సీఈవో కార్యాలయం నుంచి ...

ఈసీ ఫెయిల్యూర్ – పోస్టల్ బ్యాలెట్స్ ఇలానా ?

ఏపీ ఎన్నికల సంఘం పనితీరు అత్యంత ఘోరంగా ఉంది. కనీసం పోస్టల్ ఓటింగ్ ను సరైన పద్దతిలో నిర్వహించడం కూడా చేత కాలేదు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ స్మూత్ నిర్వహించడానికి...

‘హీరామండి’ వెబ్ సిరిస్ రివ్యూ: నయనానందమే కానీ…

Heeramandi Web Series Review సంజయ్ లీలా భన్సాలీ.. ఇండియన్ సినిమాలో పరిచయం అవసరం లేని దర్శకుడు. భారీదనం ఉట్టిపడే కళాత్మక చిత్రాలతో పేరుతెచ్చున ఆయన ఇప్పుడు వెబ్ వరల్డ్ లోకి అడుగుపెట్టారు. ఆయన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close