చెలియా ఇన్‌సైడ్ టాక్ ఏంటి?

మ‌ణిర‌త్నం సినిమా అంటే ఓ అటెన్ష‌న్ మొద‌లైపోతుంది. ఆయ‌న్నుంచి డిజాస్ట‌ర్లు రావొచ్చు కాక‌…. కానీ ఎప్ప‌టికీ అదే ఉత్సుక‌త సృష్టించుకోగ‌ల‌రు. తాజాగా ‘చెలియా’పై కూడా భారీ అంచ‌నాలున్నాయి. ఈ సినిమాని తెలుగులో దిల్ రాజు విడుద‌ల చేయ‌డం వ‌ల్ల తెలుగులోనూ భారీ రిలీజ్ కి అవ‌కాశం ద‌క్కింది. ట్రైల‌ర్లు, పాట‌లు ఊరిస్తున్నాయి. మ‌రి సినిమా మాటేంటి?? ఎలా ఉండ‌బోతోంది??

‘రోజా’ టైప్ టిపిక‌ల్ క‌థ ఇద‌ని తెలుస్తోంది. ప్రేమ‌, దేశ‌భ‌క్తి స‌మ‌పాళ్ల‌లో మేళ‌వించారు మ‌ణిర‌త్నం. ఆయ‌న తీసిన ఏ ల‌వ్ స్టోరీ అయినా ఫెయిల్ కాలేదు. దేశ‌భ‌క్తి పాయింట్ కూడా ఆయ‌న అద్భుతంగా తెర‌కెక్కిస్తారు. అందుకే.. ఈ సంగమం స‌క్సెస్‌ని తీసుకొస్తుంద‌ని మ‌ణిర‌త్నం అభిమానులు గ‌ట్టిగా న‌మ్ముతున్నారు. అంతేకాదు.. ఈసినిమా చూసిన కొంత‌మంది సీనీ ప్ర‌ముఖులు ‘చెలియా అద్భుతంగా ఉంది.. మ‌ణి మ‌రోసారి మ్యాజిక్ చేయ‌బోతున్నార‌’అంటూ హింట్స్ ఇస్తున్నారు. దాంతో ‘చెలియా’పై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి.

‘చెలియా’ ప్ర‌మోష‌న్లు త‌మిళ‌నాట భారీగా జ‌రుగుతున్నాయి. అక్క‌డితో పోలిస్తే తెలుగు తేలిపోయింది. దిల్‌రాజుపై న‌మ్మ‌కంతో ఈ సినిమా అప్ప‌గించారు మ‌ణిర‌త్నం. ‘ఓకే బంగారం’ సినిమాని దిల్‌రాజు ప్ర‌మోట్ చేసిన విధానం మ‌ర్చిపోలేం. దిల్‌రాజు మార్కెటింగ్ వ్యూహాల వ‌ల్లే.. త‌మిళంలో కంటే తెలుగులో మంచి వ‌సూళ్లు ద‌క్కాయి. అయితే ఈసారి ‘చెలియా’ ప్ర‌మోష‌న్లు అంత‌గా క‌నిపించ‌డం లేదు. భార్యా వియోగంతో సినిమాల్ని ప‌క్క‌న పెట్టారు దిల్‌రాజ‌. ఆయ‌న యాక్టివ్‌గా లేని లోటు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. రాజు త‌మ్ముళ్లు శిరీష్‌, ల‌క్ష్మ‌ణ్ రంగంలోకి దిగినా.. ప్ర‌మోష‌న్ల‌లో స్పీడు లేదు. నిజానికి ఈ వారం తెలుగు లో ఈ సినిమాని అతిక‌ష్ట‌మ్మీద విడుద‌ల చేస్తున్నార్ట‌. ఈ వారం విడుద‌ల కాక‌పోతే.. ‘బాహుబ‌లి 2’ విడుద‌లైన 15 రోజుల వ‌రకూ ఎదురుచూడాల్సిందే. పైగా తెలుగు, త‌మిళం రెండు చోట్లా ఒకే డేట్ ఫిక్స్ చేయ‌డం వ‌ల్ల ఈనెల 7న విడుద‌ల చేయ‌డం త‌ప్ప‌డం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close