తెలంగాణాలో కటీఫ్ ఖాయం…ఎపి పరిస్థితేంటో?

2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచీ కూడా మాటలెక్కువ…చేతలు తక్కువ అనేలా సాగుతోంది చంద్రబాబు పాలనతీరు. ఓటర్లను నమ్మించడం కోసం చంద్రబాబు ఇచ్చిన అలవిగాని హామీలు గుదిబండలా మారిన పరిస్థితులతోనే పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయిన చంద్రబాబుకు మోడీ, వెంకయ్యనాయుడులు ఇచ్చిన షాకులు కోలుకోకుండా చేశాయి. ప్రత్యేక హోదా, రైల్వేజోన్, రాజధాని నిధులులాంటి కేంద్ర హామీలన్నీ నెరవేరి ఉంటే ఇప్పుడు చంద్రబాబు రేంజ్ ఇంకోలా ఉండేది కానీ నమ్ముకున్న మోడీ నట్టేట ముంచేశాడు. అంతకంటే కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు చేస్తున్న ప్రతి అన్యాయాన్ని సమర్థించాల్సిన పరిస్థితిని చంద్రబాబుకు క్రియేట్ చేశారు. చాలా మంది అనుకుంటున్నట్టుగా ఓటుకు కోట్లు కేసే కారణమవుతోందో లేక రాజధాని చుట్టూ జరుగుతున్న లావాదేవీలు కారణమవుతున్నాయో…ఇంకేవైనా కారణాలు ఉన్నాయో ఏమో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అణాపైసా సాయం చేయకపోగా…ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకుండా పూర్తిగా అన్యాయం చేస్తున్న మోడీని సమర్థించాల్సిన పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నాడన్నది వాస్తవం. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా బిజెపితో కలిసి ప్రయాణం చేయడానికే చంద్రబాబు నానాపాట్లూ పడుతున్నాడు. కానీ ఉత్తరప్రదేశ్‌లో బిజెపి సాధించిన ఘనవిజయంతో బిజెపి నేతల స్టాండ్ పూర్తిగా మారిపోయింది. తెలంగాణాలో టిడిపితో కలిసి పోటీ చేసేది లేదని…2019లో సొంతంగానే ఎన్నికలకు వెళతామని వెంకయ్యనాయుడు ఈ రోజు స్పష్టం చేశారు. బాబుకు అత్యంత సన్నిహితుడైన వెంకయ్యనాయుడి నోటి నుంచి వచ్చిన వాక్కు కాబట్టి తెలంగాణాలో టిడిపి-బిజెపి కటీఫ్ ఖాయం అని ఫిక్స్ అయిపోవచ్చు.

మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలుగునాట రాజకీయాలు మాత్రం రెండు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులతోనూ గట్టిగా ప్రభావితమవుతున్నాయి. తెలంగాణాలో టిడిపి అస్థిత్వం ప్రమాదంలో పడడానికి కూడా కారణం అదే. అలాంటి నేపథ్యంలో తెలంగాణాలో టిడిపి-బిజెపిలు విడిపోతే ఇరుపార్టీలు కూడా పరస్పరం విమర్శంచుకోవడం ఖాయం. ఆ విమర్శలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా చేరడం ఖాయం. రెండు రాష్ట్రాల్లోనూ ఒకే మీడియా సంస్థలు ఉండడంతోనే ఈ పరిస్థితి. అలాంటప్పుడు తెలంగాణాలో మాత్రం చంద్రబాబుని విమర్శించి…ఆంధ్రాలో అడుగుపెట్టగానే పొగుడుతాం అంటే ప్రజలు నమ్ముతారా? పురంధేశ్వరి, సోము వీర్రాజులాంటి నేతలు టిడిపికి కటీఫ్ చెప్పేద్దామని బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. యూపీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత బిజెపి నాయకుల కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆ రేంజ్‌లో ఉన్నాయి మరి. తెలంగాణాలో ప్రత్యర్థులుగా పోటీ పడితే మాత్రం ఆ ప్రభావం ఆంధ్రాలోనూ పడడం ఖాయంగానే కనిపిస్తోంది. అపర చాణక్యుడు, అత్యంత అనుభవజ్ఙడు అని టిడిపి నేతలు చెప్పుకుంటున్న చంద్రబాబు నిర్ణయం ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. లేకపోతే అందరూ ఊహిస్తున్నట్టుగా 2019 ఎన్నికల నాటికి బిజెపికి హ్యాండ్ ఇచ్చి జనసేనతో కలిసి పోటీపడదామన్న ఆలోచనలో ఉన్నాడేమో తెలియదు. టిడిపి-బిజెపిల పొత్తు రాజకీయాలు మాత్రం చివరి దశకు వచ్చేసినట్టుగా కనిపిస్తోంది. మోడీ, చంద్రబాబు చెప్పుకున్నట్టుగా సహజ మిత్రులయిన టిడిపి-బిజెపిల క్లైమాక్స్ ఎపిసోడ్ ఎంత రసవత్తరంగా ఉండబోతుందో చూడాలి మరి. 2018 సెకండ్ హాఫ్ నుంచి ఆ సరికొత్త అంకానికి తెరలేవడం ఖాయంగా కనిపిస్తోంది. చంద్రబాబు అవినీతిని తట్టుకోలేక పోత్తుకు కటీఫ్ చెప్తున్నామని బిజెపివాళ్ళు చెప్తారో….లేక మతతత్వ రాజకీయాలు నచ్చకే బిజెపికి దూరం జరుగుతున్నామని చంద్రబాబు మరోసారి 2004 తర్వాత వినిపించిన రికార్డ్ వినిపిస్తాడేమో చూడాలి. మొత్తానికి 2014 నుంచి ఇప్పటి వరకూ కూడా టిడిపి-బిజెపిల పొత్తుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగింది మాత్రం ఏమీ లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ‘లేడీస్ స్పెష‌ల్’

ముందు నుంచీ... విభిన్న‌మైన దారినే వెళ్తున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. త‌ను ఎంచుకొనే ప్ర‌తీ క‌థా... తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓవ‌ కొత్త జోన‌ర్ ని ప‌రిచ‌యం చేసింది. 'హ‌నుమాన్' తో పాన్ ఇండియా క్రేజ్...

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close