లెజెండరీ డైరక్టర్ మణిరత్నం కథలు ఈ మధ్య ఆడియన్స్ కి నచ్చటం లేదు. మణిరత్నం కథలు అవుట్ డేటెడ్ అయిపోయాయని, రూటు మార్చితే బాగుంటుందని ఆయన ఫాన్స్ ఆశిస్తున్నారు. చాలా కాలం తరువాత ‘పొన్నియన్ సెల్వన్’ మూవీతో పర్వాలేదనిపించు కున్నారు. పొన్నియన్ సెల్వన్ కూడా తమిళ భాషపై ప్రేమతో అక్కడి వారు మాత్రమే ఆదరించారు. మిగతా భాషల్లో అంత ఆదరణ పొందలేదు. ఒకప్పుడు మణి రత్నం అంటే ఒక బ్రాండ్ లా ఉండేది. ముఖ్యంగా లవ్ స్టోరీస్, పొలిటికల్ డ్రామాలని స్పెషల్ గా తెరకెక్కించేవారు. మళ్ళీ అలాంటి కథల కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ‘థగ్ లైఫ్ సినిమాతో సినీప్రియులని నిరాశ పరిచిన మణి రత్నం నెక్స్ట్ ఒక లవ్ స్టోరీ తెరకెక్కించే పనిలో పడ్డారట.
లవ్ స్టోరీ స్పెషలిస్ట్ అయిన మణిరత్నం తన కథ కోసం క్రేజీ స్టార్స్ ని సెలక్ట్ చేసుకున్నట్లు టాక్, అవును విజయ్ సేతుపతి, సాయి పల్లవిలను మెయిన్ లీడ్స్ గా పెట్టి లవ్ స్టోరీ తీసేందుకు సిద్దపడుతున్నారని సమాచారం. ఈ న్యూస్ సినీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. కారణం టాలెంటెడ్ యాక్టర్స్ ఇద్దరితో లెజండ్రీ దర్శకుడు మణిరత్నం లవ్ స్టోరీ తీస్తుండటమే. మణిరత్నం సినిమాల్లో హీరో, హీరోయిన్స్ రోల్స్ చాలా స్పెషల్ గా ఉంటాయి. మెయిన్ పాత్రలు సాఫ్ట్ గా ఉంటూ, బలమైన ఎమోషన్స్ పండిస్తాయి. విజయ్ సేతుపతి లాంటి డిఫరెంట్ నటుడు మణి రత్నం కథకి సరిపోతాడా ? అని సంశయం ఒక వైపు , ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసే సేతుపతి మణిరత్నం కథలో ఎలా ఒదిగిపోతాడో చూడాలన్న ఆసక్తి ఇంకోవైపు నెలకొంది.
హీరోయిన్ సాయి పల్లవి రూటే సెపరేటు. హీరో , దర్శకుడు, స్టార్స్ లెక్కలు వేసుకోకుండా కథ నచ్చితే ఓకే చెప్తుంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అయితే కచ్చితంగా ఓకే చెప్తుంది. మణి రత్నం కథల్లో హీరోయిన్ కి ఉండే క్వాలిటీస్ సాయి పల్లవి లో చాలా ఉంటాయి. మణిరత్నం సినిమాకి పర్ఫెక్ట్ ఛాయిస్ సాయి పల్లవి. పైగా సేతుపతి , సాయి పల్లవి కాంబినేషన్స్ లో ఇప్పటివరలు సినిమాలు రాలేదు. ఫస్ట్ టైం ఇద్దరు టాలెంటెడ్ యాక్టర్స్ కలిసి నటించనున్నారు. వీరి సెలక్షన్ తోనే మణిరత్నం సగం హిట్ కొట్టేసినట్లే.
