రౌడీ బ‌ర్త్ డేకి.. బోలెడ‌న్ని స‌ర్‌ప్రైజ్‌లు

ఈనెల 9న విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా రౌడీ కొత్త సినిమా సంగ‌తులన్నీ ఒకేసారి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నాయి. విజ‌య్ ప్ర‌స్తుతం గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ 9న అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు. దిల్ రాజు బ్యాన‌ర్‌లో విజ‌య్ మ‌రో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ర‌వికిర‌ణ్ కోలా (రాజావారు – రాణీగారు ఫేమ్‌) దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘రౌడీ జ‌నార్థ‌న్’ అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. విజ‌య్ పుట్టిన రోజున కాన్సెప్ట్ వీడియోని విడుద‌ల చేసే ప్ర‌య‌త్నాల్లో ఉంది చిత్ర‌బృందం. ఇదో విలేజ్ యాక్ష‌న్ డ్రామా. ప్ర‌స్తుతం క‌థానాయిక కోసం అన్వేష‌ణ జ‌రుగుతోంది.

మ‌రోవైపు టాక్సీవాలా కాంబో రిపీట్ అవ్వ‌బోతోంది. రాహుల్ సంకృత్య‌న్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ హీరోగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా మే 9నే రాబోతోంది. ఈమ‌ధ్యే `ది ఫ్యామిలీస్టార్‌`గా అవ‌తారం ఎత్తాడు విజ‌య్‌. ఆ సినిమా బాక్సాఫీసు ద‌గ్గర స‌రిగా ఆడ‌లేదు. అయితే ఆ ఇంపాక్ట్ ఏదీ.. విజ‌య్‌పై ప‌డిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. విజ‌య్‌ని వెదుక్కొంటూ చాలా క‌థ‌లు వ‌స్తున్నాయి. బాలీవుడ్ ఆఫ‌ర్లు కూడా అందుతున్నాయి. అయితే విజ‌య్ ఏమాత్రం తొంద‌ర‌ప‌డ‌డం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close