మారుతికి ‘బుల్లెట్’ భ‌యం

జ‌నాలు మ‌ర్చిపోయి, ఆఖరికి ఆ సినిమా హీరో కూడా వ‌దిలేసిన సినిమా `ఆర‌డుగులు బుల్లెట్`. గోపీచంద్ – న‌య‌న‌తార జంట‌గా న‌టించిన సినిమా ఇది. బి.గోపాల్ ద‌ర్శ‌కుడు. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం రావాల్సిన సినిమా ఇది. ప‌లుమార్లు విడుద‌ల తేదీ ప్ర‌క‌టించారు. మ‌రో గంట‌లో సినిమా రిలీజ్ అన‌గా.. ఆగిపోయింది. మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కూ ఆచూకీ లేదు. మ‌ధ్య‌లో ఓసారి `ఓటీటీలో వ‌స్తోంద‌హో` అన్నారు. అదీ అంతే.

ఇప్పుడు బుల్లెట్ మ‌ళ్లీ క‌దిలింది. `త్వ‌ర‌లోనే విడుద‌ల` అంటూ నిర్మాత‌లు మ‌ళ్లీ ఫ్రెష్షుగా ప్ర‌క‌టించారు. ఈసారి ఏ అవాంత‌రాలు వ‌స్తాయో తెలీదు గానీ, ఈ సినిమా ప్ర‌క‌ట‌న మాత్రం అటు గోపీచంద్ కీ, ఇటు మారుతికీ గుబులు పుట్టిస్తోంది. `అర‌డుగుల బుల్లెట్‌` ఇప్ప‌టికే… స్టేల్ అయిపోయిన ప్రాజెక్టు. ఇంత‌కాలానికి విడుద‌లైనా.. దానిపై ఎలాంటి క్రేజ్ ఉండ‌ద‌ని తెలుసు. ఈ ఎఫెక్ట్ క‌చ్చితంగా `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్`పై ప‌డుతుంద‌న్న‌ది మారుతి, గోపీచంద్ ల భ‌యం. నిర్మాత‌లు కూడా అదే ఆలోచిస్తున్నారు. `ఆర‌డుగుల బుల్లెట్` విడుద‌ల కాక‌పోవ‌డం వ‌ల్ల కొత్త‌గా వ‌చ్చే న‌ష్టం ఏమీ ఉండ‌దు. కానీ.. విడుద‌లైతే మాత్రం క‌చ్చితంగా త‌దుప‌రి సినిమాపై ఆ ప్ర‌భావం ఉంటుంది. కాక‌పోతే.. `అర‌డుగుల బుల్లెట్`ని అడ్డుకునే హ‌క్కు వీళ్లిద్ద‌రికీ లేదు. మ‌న‌సులో `మ‌ళ్లీ విడుద‌ల ఆగిపోతే బాగుణ్ణు` అనుకుంటే త‌ప్ప‌. నిర్మాత‌లు మాత్రం ఎలాగోలా ఈ సినిమాని విడుద‌ల చేసి, ఎంతో కొంత రాబ‌ట్టుకుందామ‌నుకుంటున్నారు. అయితే ఇప్పుడున్న ప‌రిస్థిల్లో ఈ సినిమా విడుద‌లైతే, క‌నీసం థియేట‌ర్ అద్దెలైనా వ‌స్తాయా, రావా? అన్న‌ది డౌటు. న‌య‌న‌తార పోస్ట‌ర్లు చూసి జ‌నాలు వ‌స్తార‌న్న ఆశ నిర్మాత‌ల‌కు ఉందేమో. కానీ అవి ఒక‌ప్ప‌టి రోజులు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రెండు నియోజకవర్గాల సమీక్షతోనే అలసిపోయారా !?

సీఎం జగన్ ఏదీ ప్రారంభించినా ఆర్భాటంగానే ఉంటుంది. కానీ తర్వాతే దాని గురించి అసలు పట్టించుకోరు. ప్రభుత్వ కార్యక్రమం అయినా.. పార్టీ కార్యక్రమం అయినా అంతే. నియోజకవర్గాల సమీక్షలను యాభై మంది కార్యకర్తలతో...

ఆ తిప్పలు టీచర్లకే కాదు.. త్వరలో ఉద్యోగులందరికీ !

ఏపీలో ఉద్యోగులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. టీచర్లకు కొత్తగా సెల్ఫీ అటెండెన్స్‌ను తీసుకు వచ్చారు. తమ సొంత ఫోన్‌లో ప్రభుత్వం చెప్పిన యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని.. ఆ యాప్‌లో...

మ‌హేష్ – త్రివిక్ర‌మ్‌… ఇంత ఫాస్ట్ గానా?

అగ్ర హీరో సినిమా అంటే క‌నీసం ప్రొడ‌క్ష‌న్ కోసం యేడాది కేటాయించాల్సిందే. త్రివిక్ర‌మ్ లాంటి డైరెక్ట‌ర్ అంటే.... ఇంకా ఎక్కువ టైమే ప‌డుతుంది. ఎందుకంటే త్రివిక్ర‌మ్‌కి ఏదీ ఓ ప‌ట్టాన న‌చ్చ‌దు. మేకింగ్...

ఇక మోడీ టార్గెట్ రాజ్‌నాథ్ !

నరేంద్రమోదీ , అమిత్ షా గుజరాత్ రాజకీయాల్లో కిందా మీదా పడుతున్నప్పుడు వారంతా బీజేపీని నడిపించారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే ఎప్పుడైనా మోదీ ప్రధాని అభ్యర్థి అవడానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close