రొటీన్ సినిమా అని ముందే చెప్పేశాడు

‘మా సినిమా కొత్త‌గా ఉంటుంది.. ఇది వ‌ర‌కెప్పుడూ ఇలాంటి పాయింట్ రాలేదు..’ అని సినిమా విడుద‌ల‌కు ముందు ద‌ర్శ‌క నిర్మాత‌లు డ‌బ్బా కొట్టుకోవ‌డం మామూలే. అయితే మారుతి మాత్రం… త‌న సినిమాకి రివ‌ర్స్ స్ట్రాట‌జీని వాడుతున్నాడు. ‘మా సినిమా రొటీన్ గానే ఉంటుంది. కానీ బాగుంటుంది’ అంటూ కొత్త పాట అందుకొన్నాడు.

త‌న తాజా చిత్రం ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’. గోపీచంద్ క‌థానాయ‌కుడు. జులై 1న వ‌స్తోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్లు విరివిగా జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా.. మారుతి ఈ వెరైటీ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ‘త‌మ‌ది రొటీన్ క‌థే అని.. ఇది వ‌ర‌కు చాలా క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో చూసిన సీన్లే.. ఆ ఫార్ములాలోనే సినిమా ఉంటుంద‌’ని కుండ బ‌ద్ద‌లు కొట్టేశాడు. ”కొన్ని సినిమాలు చూస్తే.. `ఇది ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా రా` అంటారు. ఆ మాట మాకు మేం ముందే అనేనుకొనే టైటిల్ పెట్టాం. ఈ సినిమాలో అన్నీ క‌మ‌ర్షియ‌ల్ హంగులే ఉంటాయి. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో లాజిక్ ఉండ‌దు. మా సినిమాల్లోనూ దాన్ని వెత‌క్కండి… పాట‌ల కోసం పాట‌లు.. ఫైట్ల కోసం ఫైట్లు.. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల ఫార్ములా. దానికి త‌గ్గ‌ట్టుగానే… ఈ సినిమా తీశాం” అని చెబుతున్నాడు మారుతి. ఆయ‌నే అలా అంటే.. చూసినోళ్లు ఇంకేం అన‌డానికి లేదుగా. అందుకే ముందే హింట్ ఇచ్చేసి, ప్రేక్ష‌కుల్ని ప్రిపేర్ చేస్తున్నాడ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అల్ల‌రి న‌రేష్‌.. మ‌ళ్లీనా..?

ఈవీవీ మంచి ద‌ర్శ‌కుడే కాదు. నిర్మాత కూడా. ఈవీవీ సినిమా ప‌తాకంపై ఆయ‌న కొన్ని మంచి చిత్రాల్ని అందించారు. ఫ్లాపుల్లో ప‌డి స‌త‌మ‌త‌మ‌వుతున్న ఈవీవీకి... త‌న సొంత బ్యాన‌రే మ‌ళ్లీ నిల‌బెట్టింది. ఈవీవీ...

బీజేపీని టార్గెట్ చేసే స్టైల్ మార్చిన కేసీఆర్ !

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని ఇష్టారీతిన విమర్శించడమే ఇప్పటి వరకూ బీజేపీపై చేస్తున్న యుద్దంగా భావించేవారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు స్టైల్ మార్చారు. వికారాబాద్‌లో కలెక్టరేట్ భవనాలను ప్రారంభించిన ఆయన......

“ఆ ప్రశ్న” అడిగితే అసహనానికి గురవుతున్న జనసేన !

మంత్రి అంబటి రాంబాబుపై జనసేన పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఆయనపై రకరకాల పద ప్రయోగాలు చేస్తూ మండి పడుతున్నారు. అంబటి రాంబాబును బపూన్‌ను చేస్తూ.. ఆయన ఫోటోను మార్ఫింగ్ చేసి మరీ...

లెక్కల్లేవ్ ..అయినా ఏపీని అలా వదిలేశారేంటి !?

ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నంత మాత్రాన వారికి రాసిచ్చినట్లు కాదు. ఏదైనా రాజ్యాంగ పరంగా చేయాలి. ప్రజలు పన్నులు కట్టగా వచ్చే డబ్బును.. వారిని చూపించి చేసే అప్పును.. పద్దతిగా వాడాలి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close