ద‌స‌రాలో… నానికీ వాటా?

నాని ఇప్పుడు కాస్త డౌన్ లో ఉన్నాడు. వ‌రుస‌గా అన్నీ ఎదురు దెబ్బ‌లే. ఇప్పుడు త‌న ఆశ‌ల‌న్నీ `ద‌స‌రా`పైనే ఉన్నాయి. శ్రీ‌కాంత్ అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు. బ‌డ్జెట్ కూడా భారీగా కేటాయించారు. అయితే.. నాని వ‌రుస ఫ్లాపుల దృష్ట్యా.. `ద‌స‌రా` బ‌డ్జెట్‌లో కోత ప‌డుతుంద‌ని వార్త‌లొస్తున్నాయి. అందుకే నాని కూడా కాస్త ముందు జాగ్ర‌త్త‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని టాక్‌.

ఈ సినిమాపై నాని చాలా హోప్స్ పెట్టుకొన్నాడు. క‌థ‌పై కూడా నానికి బాగా గురి కుదిరింది. ఖ‌ర్చు పెట్టి తీయాల్సిన సినిమా ఇది. బ‌డ్జెట్ లో కోత విధిస్తే… క్వాలిటీ దెబ్బ తింటుంది. అందుకే నాని త‌న పారితోషికాన్ని వ‌దులుకొంటున్నాడ‌ని టాక్‌. బ‌దులుగా ఈ సినిమా నిర్మాణంగా భాగం పంచుకోబోతున్నాడ‌ని తెలుస్తోంది. సినిమా అంతా పూర్త‌య్యాక‌, జ‌రిగిన బిజినెస్‌ని బ‌ట్టి.. అప్పుడు పారితోషికం తీసుకోవాల‌ని నాని డిసైడ్ అయ్యాడ‌ట‌. నిజంగా మంచి మూవ్ ఇది. త‌న సినిమా త‌న‌కు కావ‌ల్సిన‌ట్టు వ‌స్తుంది, లాభాలొస్తే.. నాని తీసుకొనే పారితోషిక‌మూ బాగా పెరుగుతుంది. ఈమ‌ధ్య ప్రొడ‌క్ష‌న్ లో చేరి, నాని కూడా నిర్మాత‌గా మార‌బ‌ట్టి.. నిర్మాత‌ల వైపు నుంచి కూడా ఆలోచించ‌డం మొద‌లెట్టాడ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అల్ల‌రి న‌రేష్‌.. మ‌ళ్లీనా..?

ఈవీవీ మంచి ద‌ర్శ‌కుడే కాదు. నిర్మాత కూడా. ఈవీవీ సినిమా ప‌తాకంపై ఆయ‌న కొన్ని మంచి చిత్రాల్ని అందించారు. ఫ్లాపుల్లో ప‌డి స‌త‌మ‌త‌మ‌వుతున్న ఈవీవీకి... త‌న సొంత బ్యాన‌రే మ‌ళ్లీ నిల‌బెట్టింది. ఈవీవీ...

బీజేపీని టార్గెట్ చేసే స్టైల్ మార్చిన కేసీఆర్ !

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని ఇష్టారీతిన విమర్శించడమే ఇప్పటి వరకూ బీజేపీపై చేస్తున్న యుద్దంగా భావించేవారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు స్టైల్ మార్చారు. వికారాబాద్‌లో కలెక్టరేట్ భవనాలను ప్రారంభించిన ఆయన......

“ఆ ప్రశ్న” అడిగితే అసహనానికి గురవుతున్న జనసేన !

మంత్రి అంబటి రాంబాబుపై జనసేన పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఆయనపై రకరకాల పద ప్రయోగాలు చేస్తూ మండి పడుతున్నారు. అంబటి రాంబాబును బపూన్‌ను చేస్తూ.. ఆయన ఫోటోను మార్ఫింగ్ చేసి మరీ...

లెక్కల్లేవ్ ..అయినా ఏపీని అలా వదిలేశారేంటి !?

ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నంత మాత్రాన వారికి రాసిచ్చినట్లు కాదు. ఏదైనా రాజ్యాంగ పరంగా చేయాలి. ప్రజలు పన్నులు కట్టగా వచ్చే డబ్బును.. వారిని చూపించి చేసే అప్పును.. పద్దతిగా వాడాలి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close