మారుతి ద‌గ్గ‌ర సెకండాఫ్ లేదా?

ప్ర‌తిరోజూ పండ‌గే తో ఓ సూప‌ర్ హిట్ ఇచ్చాడు మారుతి. ఆ త‌ర‌వాత‌.. మారుతి సినిమా ఎవ‌రితో అనే విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కూ క్లారిటీ లేదు. ముందు రామ్ తో అనుకున్నారు. ఇప్పుడు ర‌వితేజ పేరు గ‌ట్టిగా వినిపిస్తోంది. 90 శాతం ర‌వితేజ‌తోనే సినిమా ఖాయ‌మ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇటీవ‌ల ర‌వితేజ‌తో మారుతి భేటీ జ‌రిగింది. లైన్ కూడా చెప్పేశాడు. కాక‌పోతే.. ఒక‌టే స‌మ‌స్య‌. మారుతి ద‌గ్గ‌ర సెకండాఫ్ లేద‌ట‌.

మారుతి లైన్ల‌న్నీ సింపుల్ గా ఉంటాయి. ఓ చిన్న పాయింట్ చుట్టూ క‌థ‌ని అల్లుకోవ‌డం మారుతికి అల‌వాటు. ఈసారి కూడా అదే పంథాలో ఓ లైన్ సిద్ధం చేసుకున్నాడ‌ట‌. ఫ‌స్టాఫ్ వ‌ర‌కూ మారుతి ద‌గ్గ‌ర క‌థ ఉంద‌ని, సెకండాఫ్ ఇంకా సెట్ కాలేద‌ని తెలుస్తోంది. `సెకండాఫ్ కూడా పూర్త‌య్యాక రండి..` అంటూ ర‌వితేజ చెప్పాడ‌ట‌. దాంతో… ఇప్పుడు సెకండాఫ్ కోసం త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నాడు మారుతి. ర‌వితేజ‌తో స‌మ‌స్య ఏమిటంటే.. ఇప్ప‌టికే చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఎడా పెడా క‌థ‌లు ఒప్పేసుకుని, డైరెక్ట‌ర్న‌ని లైన్ లో పెడుతున్నాడు. వాటిలో ఏది ముందు ప‌ట్టాలెక్కుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి. ర‌వితేజ‌తో క‌మిట్ అయి, ఫిక్స‌యిపోతే – ర‌వితేజ లైన్‌లోకి వ‌చ్చి, సినిమా చేయ‌డానికి ఎంత టైమ్ ప‌డుతుందో చెప్ప‌లేం. అందుకే మారుతి సెకండ్ ఆప్ష‌న్ కోసం ఎదురు చూస్తున్నాడ‌ట‌. ర‌వితేజ కు ఈ సినిమా చేయ‌డం కుద‌ర‌ని ప‌క్షంలో.. మ‌రో హీరోతో క‌మిట్ అవ్వాల‌నుకుంటున్నాడు. మ‌రి ఆ హీరో ఎవ‌రో మ‌రి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బాలీవుడ్ లో ‘రేసుగుర్రం’ దౌడు!

ఎందుకో బాలీవుడ్ దృష్టి.. మ‌న పాత తెలుగు సినిమాల‌పై ప‌డింది. మిథునం, ఛ‌త్ర‌ప‌తి, ఊస‌ర‌వెల్లి లాంటి సినిమాల్ని వాళ్లు రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు కాస్త ఆల‌స్య‌మైనా... మరో హిట్ సినిమా కూడా బాలీవుడ్...

ఎన్నాళ్ల‌కు గుర్తొచ్చావు.. స‌లోనీ!?

స‌లోని... ఈ పేరు విని చాలా కాలం అయ్యింది క‌దా..? రాజ‌మౌళి సినిమాలో హీరోయిన్ గా న‌టించినా.. ఏమాత్రం గుర్తింపు తెచ్చుకోలేదు. మ‌ర్యాద రామన్న లాంటి హిట్ చేతిలో ప‌డినా, దాన్ని...

గ్రేటర్ హీట్ : కేసీఆర్ పొలిటికల్..మోదీ అపొలిటికల్..!

గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రచారం తారస్థాయికి చేరింది. అవడానికి స్థానిక సంస్థ ఎన్నికే అయినా... ప్రచారంలోకి అగ్రనేతలు వస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో ప్రచారసభలో...

తుపాను బాధితులకు జగన్ ఊహించనంత సాయం..!?

నివర్ తుపాన్ కారణంగా కోస్తా రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట చేతికొచ్చే దశలో సర్వం కోల్పోయిన రైతులు పెద్ద ఎత్తున ఉన్నారు. రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు కోస్తా మొత్తం తుపాను...

HOT NEWS

[X] Close
[X] Close