‘డేంజ‌ర్ జోన్‌’ నుంచి బ‌య‌ట‌ప‌డ్డ బాలు

ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం గ‌త కొన్ని రోజులుగా ప్రాణాల‌తో పోరాడుతున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా బారీన ప‌డి, చెన్నైలోని ఓ ఆసుప‌త్రిలో చేరిన బాలు ఆరోగ్య ప‌రిస్థితి క్ర‌మంగా క్షీణించ‌డంతో ఆయ‌న్ని ఐసీయూలో చేర్పించారు. ఆ త‌ర‌వాత‌.. ఆయ‌న మ‌రింత బ‌ల‌హీన ప‌డ్డారు. వెంటిలేట‌ర్ స‌హాయంతో ఆయ‌న‌కు చికిత్స అందించారు డాక్ట‌ర్లు. ఆయన స్పృహ‌లోనికి వ‌చ్చి, మ‌నుషుల్ని గుర్తు ప‌ట్ట‌డానికే చాలా రోజులు ప‌ట్టింది. నిజానికి బాలు.. ప్రాణాల‌తో పోరాడారు. ఆయ‌న ఆరోగ్యంపై ఇటు అభిమానుల‌తో పాటు అటు డాక్ట‌ర్లు కూడా ఆందోళ‌న చెందారు.

అయితే ఇప్పుడు బాలు డేంజ‌ర్ జోన్‌నుంచి బ‌య‌ట‌ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న ఆరోగ్యం పూర్తిగా కోలుకోక‌పోయినా, ఇప్పుడు ప్రాణాల‌కు వ‌చ్చిన ముప్పేమీ లేద‌ని వైద్యులు కుటుంబ స‌భ్యుల‌కు అభ‌య‌హ‌స్తం అందించారని తెలుస్తోంది. సోమ‌వారం ఓ గుడ్ న్యూస్ చెబుతా అంటూ.. బాలు త‌న‌యుడు చ‌రణ్ తెలిపాడు. సోమ‌వారం బాలుని ఐసీయూ నుంచి సాధార‌ణ గ‌దికి డిశ్చార్జ్ చేస్తార‌ని తెలుస్తోంది. మ‌రో వారం ప‌ది రోజుల్లో ఆయ‌న వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే ఉంటారు. ఈ నెలాఖ‌రు నాటికి బాలు ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయి.. ఇంటికి చేరుకుంటార‌ని స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇప్పుడు ఏపీ మద్యం దుకాణాల్లో నో క్యాష్ పాలసీ !

నిన్నామొన్నటిదాకా క్యాష్ తప్ప మరో డిజటల్ పేమెంట్ తీసుకోలేదు ఏపీ మద్యం దుకాణాల్లో. ఇప్పుడు పాలసీ ఒక్క సారిగా మారిపోయింది. శుక్రవారం నుంచి ప్రభుత్వం పాలసీ మార్చేసింది. డిజిటల్ పేమెంట్...

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటే ఏపీకి ఏం ఉపయోగం !?

విభజన చట్టంలో ఉన్న ఉమ్మడి రాజధాని అంశానికి జూన్ రెండో తేదీన ముగింపు రాబోతోంది. మరోసారి పొడిగింపు అసాధ్యం అని తెలిసినా సరే కొంత మంది ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలనే...

డ్రగ్స్ పార్టీ కేసు వైసీపీ చుట్టే తిరుగుతోంది !

డ్రగ్స్ అంటే వైసీపీ పేరు ఖచ్చితంగా వస్తోంది. ఏదో ఆషామాషీగా మీడియాలో వచ్చే కథనాలు కాదు. నేరుగా పోలీసు కేసుల్లో ఇరుక్కుంటున్నవారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఏ 2గా నిలిచిన...

పల్లీబఠాణి కామెంట్స్‌తో రాకేష్ రెడ్డిని ముంచిన కేటీఆర్

బిట్స్ పిలానీ గొప్ప కావొచ్చు కానీ మిగతా గ్రాడ్యూయేట్స్ అంతా పల్లీ బఠాణీలు అంటే ఎలా ?. కేటీఆర్ ఇది ఆలోచించలేదు. ప్రాస బాగుంది కదా అని అనేశారు. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close