రవితేజ ‘మాస్ జాతర’ నుంచి ఓ ఊరనాటు పాటని వదిలారు. ఓలే.. ఓలే..’ అంటూ సాగే ఈ పాటని శ్రీకాకుళం యాసలో నాటుగా కంపోజ్ చేశారుభీమ్స్. ఈ పాటకు భాస్కర్ యాదవ్ దాసరి అందించిన సాహిత్యం పరమనాటు గా వుంది.
ఓలే ఓలే గుంట
నీ అయ్యకాడ ఉంటా
నీ అమ్మకాడ తింటా
నీ వొళ్ళోకొచ్చి పంటా
బుద్ధి లేదు జ్ఞానం లేదు సిగ్గు లేదు
మంచి లేదు మర్యాద లేదు
అంగీ లేదు లుంగీ లేదు పంచె లేదు
తాడు లేదు బొంగరం లేదు
నీ అమ్మని నీ అక్కని నీ తల్లిని నీ చెల్లిని పట్టుకుని కాళ్లు మొక్కి పోతా.. ఓలే ఓలే గుంట.. ఇంత ఊరనాటుగా సాగిపోయింది సాహిత్యం.
ధమాకా సినిమాలో పల్సర్ బండి పాట మంచి కిక్ ఇచ్చింది. మళ్ళీ అలాంటి ఫోక్ సాంగ్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ పాటని సెట్ చేసిననట్లుగా కనిపిస్తోంది. రవితేజ, శ్రీలీల డ్యాన్సులు హైలెట్ గా నిలిచే ఛాన్స్ వుంది. ఇలాంటి పాటలు మాస్ థియేటర్స్ ఊపేస్తాయి. శ్రీరాములు లాంటి థియేటర్స్ లో కలర్ ఫుల్ లైట్స్ మధ్య ఇలాంటి పాటలు చూడటం అదోరకం కిక్కు. బహుసా ఆ కిక్కు కోసం ఇలాంటి పాటని ఏరికోరి డిజైన్ చేశారని భావించాలి.