విశాఖలో మరో “ఫార్మా ఫైర్”..! ఎందుకిలా..?

విశాఖలో అర్థరాత్రి మరో భారీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది. ప్రత్యేకంగా కెమికల్స్ తయారు చేసి.. ఇతర ఫార్మా కంపెనీలకు విక్రయించే… విశాఖ సాల్వెంట్స్ సంస్థలో ప్రమాదం జరింది. ఫ్యాక్టరీ మొత్తం కెమికల్స్‌తో నిండి ఉండటంతో.. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. డ్రమ్ముల్లో ఉన్న కెమికల్స్… బాంబుల్లా పేలిపోయాయి. ఫలితంగా.. అర్థరాత్రి పూట.. ఆ బాంబుల శబ్దాలు పది కిలోమీటర్ల వరకూ వినిపించాయి. ఎగసిపడిన మంటలు.. సిటీ మొత్తం కనిపించాయి. దీంతో ప్రజలు భయందోళనకు గురగయ్యారు. హుటాహుటిన అధికార యంత్రాంగం.. ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ వద్దకు చేరుకుంది. ప్రాణ నష్టం మాత్రం జరగలేదని.. చెబుతున్నారు. ప్రమాదం సమయంలో కేవలం నలుగురు మాత్రమే… ఫ్యాక్టరీలో ఉన్నారని.. వారిలో ఒక్కరికి మాత్రమే తీవ్ర గాయాలయ్యాయని.. చెబుతున్నారు.

లాక్ డౌన్ తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల్లో కెమికల్స్ పేలుళ్లు ప్రారంభమయ్యాయి. మొదట ఎల్జీ పాలిమర్స్‌తో ప్రారంభమయింది. ఆ ప్రమాదం.. దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ తర్వాత నంద్యాలలో ఎస్పీవై కెమికల్స్.. మొన్న విశాఖ పార్మాసిటీలో సాయినార్ కెమికల్స్‌లో ప్రమాదం జరిగింది. తాజాగా ఇప్పుడు… విశాఖ సాల్వెంట్స్ కంపెనీలో చోటు చేసుకుంది. వరుస ప్రమాదాలతో.. ప్రజలు భయభ్రాంతాలవుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు… అధికార యంత్రాంగం హడావుడి చేస్తోంది. ప్రాణ నష్టం తగ్గించాం… క్షతగ్రాతులకు మెరుగైన వైద్యం అందిస్తాం.. యంత్రాంగం అద్భుతంగా స్పందించిందని… పడికట్టు పదాలతో.. తమను తాము శభాష్ అనుకుంటున్నారు కానీ.. అసలు సమస్యకు మూలం ఏమిటి..? ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయన్నదానిపై మాత్రం.. దృష్టి పెట్టడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

లాక్‌డౌన్ తర్వాత ప్రమాదకర పరిశ్రమలను గుర్తించామని… ట్రైల్ రన్ నిర్వహించి.. మొత్తం సేఫ్టీ చూసుకున్న తర్వాతనే.. కార్యకలాపాలు ప్రారంభించేలా.. పరిశ్రమల శాఖను అప్రమత్తం చేశామని ప్రభుత్వం చెబుతోంది. కానీ.. అలా చేయలేదని.. వరుసగా జరుగుతున్న ప్రమాదాలే నిరూపిస్తున్నాయని అంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని.. విశాఖ ఫార్మా సిటీప్రజలు ఉలిక్కి పడుతున్నారు. సాల్వేంట్ పరిశ్రమలో మంటల భయంకరంగా ఉండటంతో.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రాత్రికి రాత్రి గ్రామాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close