కండ‌లు పెంచుతున్న‌ నాగ‌శౌర్య

ల‌వర్ బోయ్ పాత్ర‌ల‌కు అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతాడు నాగశౌర్య‌. త‌న కెరీర్‌లో అలాంటి క‌థ‌లే ఎక్కువ విజ‌యాల్ని అందించాయి. అయితే… మాస్ హీరోగా నిరూపించుకోవాల‌న్న‌ది నాగ‌శౌర్య తాప‌త్ర‌యం. అలాంటి క‌థ‌లు ఎంచుకుంటున్నా – స‌రైన ఫ‌లితాలు రాలేదు. అయితే ఆ ప్ర‌య‌త్నాలు మాత్రం మాన‌లేదు.

ఇప్పుడు త‌న ఫిట్ నెస్ పై నా దృష్టి పెట్టాడు శౌర్య‌. లాక్ డౌన్ స‌మ‌యంలో షూటింగుల‌న్నీ బంద్ అయ్యాయి. మ‌ళ్లీ సినిమాల హ‌డావుడి ఎప్పుడు మొద‌ల‌వుతుందో తెలీదు. ఈ స‌మ‌యాన్ని శౌర్య బాగానే ఉప‌యోగించుకుంటున్నాడు. ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో రెండు క‌థ‌ల్ని ఓకే చేశాడు శౌర్య‌. క‌లం ప‌ట్టి ఓ స్క్రిప్టు కూడా పూర్తి చేశాడు. ఇప్పుడు త‌న ఫిట్ నెస్ పెంచుకుంటున్నాడు. జిమ్‌లో కండ‌లు క‌రిగిస్తున్నాడు. కండ‌లు పెంచుకుంటున్నాడు. జిమ్ లో నాగ‌శౌర్య క‌స‌ర‌త్తులు చేస్తూ ఓ వీడియో విడుద‌ల చేశాడు. అందులో శౌర్య కండలు చూస్తుంటే `త‌ను శౌర్య‌నేనా` అనిపిస్తోంది. మాస్ క‌థ‌ల‌కు ప‌ర్‌ఫెక్ట్ గా సెట్ అయ్యేలా త‌న బాడీ సిద్ధం చేసుకుంటున్నాడ‌నిపిస్తోంది. బ‌హుశా ఇప్పుడు కొత్తగా ఒప్పుకున్న రెండు సినిమాలూ.. మాస్, యాక్ష‌న్ ఫార్ములానేనేమో. అందుకే ఇంత క‌స‌ర‌త్తు. మొత్తానికి ల‌వ‌ర్ బోయ్ కాస్త‌.. మాస్ హీరోగా మార‌డానికి స‌ర్వం సిద్ధం చేసుకుంటున్నాడు. ఒక్క హిట్టు ప‌డ‌డ‌మే బాకీ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close