తెలంగాణలో మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లలో అగ్రస్థానంలో నిలిచింది. నైట్ ఫ్రాంక్ ఇండియా , కష్మన్ & వేక్ఫీల్డ్ నివేదికల ప్రకారం, హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో జరిగే రిజిస్ట్రేషన్లలో ఈ జిల్లా 39-45% వాటాను కలిగి ఉంది. సబర్బన్ ఏరియాల్లో రెసిడెన్షియల్ డిమాండ్ భారీగా పెరగడం, కొంపల్లి వంటి ప్రాంతాల్లో రిటైల్ లీజింగ్ బూమ్ ఈ వృద్ధికి ప్రధాన కారణాలు.
2025లో హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ బలోపేతమవుతోంది. అక్టోబర్ నెలలో మాత్రమే 6,194 ఇళ్లు రిజిస్టర్ అయ్యాయి, ఇది గత ఏడాదితో పోలిస్తే 5% పెరుగుదల. మొత్తం విలువ రూ.4,512 కోట్లకు చేరింది, 25% వృద్ధి. జనవరి నుంచి అక్టోబర్ వరకు 61,699 యూనిట్లు రిజిస్టర్ అయ్యాయి.
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా సబర్బన్ ప్రాంతాలయిన కొంపల్లి, మేడ్చల్, షామీర్పేట్, దుండిగల్ వంటి ప్రాంతాల్లో రెసిడెన్షియల్ డిమాండ్‌కు కేంద్రంగా మారాయి. గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, అపార్ట్మెంట్లకు భారీ డిమాండ్ ఉంది. ఐటీ, ఫార్మా సెక్టార్ల విస్తరణ , గేట్‌వే ఐటీ పార్క్ కండ్లకోయ, జీనోమ్ వ్యాలీ 3.0 ఎక్స్టెన్షన్ వల్ల ఉద్యోగాలు పెరిగి, రెసిడెన్షియల్ ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.
ముందు ముందు కూడా మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కీలక పాత్ర పోషిస్తోంది. ఇన్ఫ్రా అభివృద్ధి, ఐటీ విస్తరణ వల్ల 2026లో మరింత వృద్ధి జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
