మీడియా వాచ్‌: సాయంకాలం ప‌త్రిక‌లు వ‌స్తున్నాయా?

సోష‌ల్ మీడియా విజృంభిస్తున్న త‌రుణంలో.. ప్రింట్ మీడియా ఇప్ప‌టికే గ‌డ్డు ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఈ నాలుగేళ్ల‌లో ముఖ్యంగా క‌రోనా త‌ర‌వాత పేప‌ర్లు చ‌దివేవాళ్లు బాగా త‌గ్గిపోయారు. పైగా అన్నీ స‌ద్దివార్త‌లే. ఫేస్ బుక్, ట్విట్ట‌ర్‌, యూ ట్యూబ్ ఛాన‌ల్స్‌, టీవీ ఛాన‌ళ్ల‌లో 24 గంట‌లూ… నిరంత‌ర వార్తా స్ర‌వంతి కొన‌సాగుతూనే ఉంది. విష‌యాలు ఎప్ప‌టిక‌ప్పుడు తెలిసిపోతున్నాయి. ఈరోజు వార్త‌.. ఇప్పుడే చెప్పేయాల‌న్న తొంద‌ర పెరుగుతోంది. దాంతో…పేప‌ర్లో వ‌చ్చేవ‌న్నీ స‌ద్దువార్త‌లైపోతున్నాయి. పేప‌ర్ తెరిస్తే… అన్నీ తెలిసిన విష‌యాలే ఉంటున్నాయి. దాంతో ఆ ఆస‌క్తి మ‌రింత స‌న్న‌గిల్లుతోంది.

ఈ నేప‌థ్యంలో ప్రింట్ మీడియాకు మ‌ళ్లీ పూర్వ వైభ‌వం ఎలా తీసుకురావాలి?  అనే విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నాయి మీడియా సంస్థ‌లు. ఈ నేప‌థ్యం సాయంకాలం ప‌త్రిక‌లపై దృష్టి పెట్టారు. ఈవినింగ్ ఎడిష‌న్ అన్న‌ది కొత్త విష‌యం ఏం కాదు. చాలా చోట్ల ఉన్న‌దే. ఇప్ప‌టికీ కొన్ని ఏరియాల్లో సాయింకాల‌పు ప‌త్రిక‌లు ర‌న్నింగ్‌లోనే ఉన్నాయి. ఉద‌యం నుంచి – సాయింత్రం వ‌ర‌కూ జ‌రిగే వార్త‌ల‌న్నీ క‌లిపి నాలుగు పేజీల్లో ఈవినింగ్ ఎడిష‌న్ పేరుతో వ‌దిలితే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న‌లో ప‌డ్డాయి ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, న‌మ‌స్తే తెలంగాణ‌, సాక్షి లాంటి మీడియా గ్రూపులు. ఉద‌యం పేప‌ర్ ఎలాగూ వ‌స్తుంది. సాయింత్రంలోగా జ‌రిగే.. విష‌యాల్ని వేడిగా అందిచాల‌న్న‌ది ప్రింట్ మీడియా తాప‌త్ర‌యం. నాలుగు పేజీలే కాబ‌ట్టి.. త‌క్కువ రేటుకి ఇవ్వొచ్చు. అయితే ఈవినింగ్ ఎడిష‌న్ లోని సాధ‌క బాధ‌కాలేంటి?  ఉద్యోగుల సంఖ్య పెంచాల్సి వ‌స్తుందా?  ఉన్న ఉద్యోగుల‌తోనే న‌డ‌పొచ్చా? అనే విష‌యంలో త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నారు. క‌నీసం నాలుగు ప్ర‌ధాన ప‌త్రిక‌ల‌లో ఒక ప‌త్రిక ఈవినింగ్ ఎడిష‌న్ అతి త్వ‌ర‌లో మొద‌లెట్టే అవ‌కాశం ఉంది. అది స‌క్సెస్ అయితే.. మిగిలిన పత్రిక‌ల‌న్నీ అదే బాట ప‌ట్ట‌డం ఖాయం. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close