రైతులొద్దు దీపికనే ముద్దు..!

దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం ఎవరికైనా తెలుసా..? ఆ ఆందోళనలు అంతకంతకూ పెరుగుతున్న విషయంపై అంచనా ఉందా..? మీడియాలోనే కాదు..సోషల్ మీడియాలోనూ ఆ విషయం ఎందుకు బయటకు రావడం లేదు..?. ఎందుకో చెప్పడం.. పెద్ద పజిల్ ఏమీ కాదు. రైతుల ఆందోళల్ని మినిమైజ్ చేయడానికి కేంద్రం చేయాల్సిందంతా చేస్తోంది. అందులో భాగంగా.. కనిపించని కట్టడి అమలవుతోంది. అదే సమయంలో.. ఘనత వహించిన మీడియాకు ఇబ్బంది లేకుండా.. టీఆర్‌పీ రేసు కూడా పెట్టింది. అదే..  హీరోయిన్లపై డ్రగ్స్ కేసు ఆరోపణలు. సుశాంత్ ఆత్మహత్య కేసు పూర్తిగా డ్రగ్స్ కేసుగా మారిపోయిన సమయంలో..హీరోయిన్లు టార్గెట‌్ అయ్యారు. వరుసగా వారికి నోటీసులు పంపుతున్నారు.

దీపికా పదుకొనే లాంటి హీరోయిన్‌కు నోటీసులు ఇచ్చారు. ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆమె విచారణకు హాజరైనా విషయమే.. హాజరు కాకపోయినా రచ్చే.. మీడియా ఎజెండా ఇలా ఉంటుంది. అదే ప్రకారం కవరేజీ సాగుతుంది. రోజంతా అదే ఉంటుంది. అందులో సందేహం ఉండదు. ఇవాళ దీపిక.. రేపు సారా.. ఆ తర్వాత శ్రద్ధాకపూర్..రకుల్.. ఇలా వాటి సీరియల్ నడుస్తూనే ఉంటుంది. మీడియా టీఆర్పీల పంట పండించుకుటూనే ఉంటుంది. కానీ.. దేశానికి వెన్నుముకగా నిలుస్తున్న రైతుల అజెండా మాత్రం.. ఎవరికీ కనిపించదు.. ఏ మీడియాలోనూ రాదు. చివరికి ఆ సెలబ్రిటీలు తప్పు చేసినట్లు ఆధారాలతో దొరికినా వారికి కూడా ఏమీ కాదు. కాకపోతే.. వారి ఇమేజ్ కొన్ని రోజులు .. రైతుల ఆందోళనలు కనిపించకుండా కవర్ చేయడానికి ఉపయోగపడుతుంది.

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతుల్లో అనేకానేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటిని కేంద్రం ఏ మాత్రం నివృతి చేయడం లేదు. కనీస మద్దతు ధర పెంచుతామని.. ఎరువుల సబ్సిడీని నేరుగా బ్యాంకులో వేస్తామని… తాయిలాలు ప్రకటిస్తోంది. కానీ.. తమ సాగు కార్పొరేట్ గుప్పిట్లోకి పోదు అనే  భయాన్ని మాత్రం తీసేయడానికి ప్రభుత్వం సంకల్పించడం లేదు.  ఇప్పటి వరకూ పంజాబ్, హర్యానాల్లో ఉద్ధృతంగా ఉన్న రైతు ఉద్యమం ఇప్పుడు… ఉత్తరాది రాష్ట్రాలన్నింటికీ పాకుతోంది. ఆ తర్వాత దక్షిణాదికి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇందులో మీడియా..సోషల్ మీడియా పాత్ర ఉండదు. కానీ రైతుల ఆవేదన ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపుపై కేసీఆర్ ఎంత నమ్మకమో..!?

దుబ్బాక ఉపఎన్నిక విషయంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చాలా క్లారిటీగా ఉన్నారు. ధరణి పోర్టల్ ప్రారంభించిన తర్వాత మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడిన కేసీఆర్.. దుబ్బాకలో గెలుపు ఎప్పుడో డిసైడైపోయిందని తేల్చారు....

సంచైతకు కౌంటర్‌గా ఊర్మిళా గజపతి..!

విజయనగరం రాజుల ఫ్యామిలీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ పెట్టిన చిచ్చును.. రాజకీయంగానే ఎదుర్కోవాలని... ఇంక ఏ మాత్రం సహించకూడదని... గజపతుల కుటుంబం నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్‌గా...

రాయలసీమ ఎత్తిపోతలను రిస్క్‌లో పెట్టేసిన ఏపీ సర్కార్..!

ముందూ వెనుకా చూసుకోకుండా.... రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పై దూకుడుగా వెళ్లిన ఏపీ సర్కార్.. ఆ ప్రాజెక్ట్‌ను పూర్తిగా రిస్క్‌లో పడేసింది. టెండర్లు ఖరారు చేసి..మేఘా కన్సార్టియంకు పనులు అప్పగించేసిన తర్వాత ఇప్పుడు......

ఏపీలో మద్యం ధరలు భారీగా తగ్గింపు..! తాగమని ప్రోత్సాహమా..?

ఆంధ్రప్రదేశ్‌లో మందు బాబులతో తాగడం మాన్పించాలని మద్యం రేట్లు షాక్ కొట్టేలా పెంచేసిన ప్రభుత్వానికి తత్వం బోధపడినట్లుగా ఉంది. షాక్ కొట్టేలా రేట్లు పెంచితే...ఆ మద్యాన్ని కొని షాక్ కొట్టించుకోకుండా... పక్క రాష్ట్రాల...

HOT NEWS

[X] Close
[X] Close