ఆ ఛానల్ కు ఇప్పటికీ బుద్ధి రాలేదు: RRR రేంజ్ లో కెసిఆర్ ఢిల్లీని వణికిస్తున్నాడట

తెలుగు రాష్ట్రాలలోని మీడియా చానల్స్ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల అడుగులకు మడుగులు ఒత్తుతూ, ప్రజాభిప్రాయం మేరకు కాకుండా ఆయా పార్టీల అజెండాకు అనుగుణంగా పని చేస్తున్నాయి అనే అభిప్రాయం తెలుగు ప్రజలలో చాలా బలంగా నాటుకుపోయింది. గత పది పదిహేను సంవత్సరాలలో న్యూస్ ఛానల్స్ ప్రవర్తించిన తీరు అందుకు ప్రధాన కారణం. అయితే నిన్నటి జిహెచ్ఎంసి, మొన్నటి దుబ్బాక ఎన్నికలకు ముందు కెసిఆర్ను టీఆర్ఎస్ పార్టీని భుజాలకెత్తుకొని మరి మోసిన అగ్ర ఛానల్, ప్రజాభిప్రాయం ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉందని ఎన్నికల్లో వ్యక్తమైన తర్వాత కూడా, కెసిఆర్ ను మోస్తున్న తీరు చూసి, ఆ ఛానల్ కు- ఎన్నికల ముందు తాము చెప్పిన అంచనాల కు, తాము మోసిన పార్టీ కి వ్యతిరేకంగా ప్రజా తీర్పు వచ్చినప్పటికీ బుద్ధి రాలేదు అంటూ సోషల్ మీడియాలో సెటైర్స్ వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

దుబ్బాక ఎన్నికలకు ముందు తమ ఛానల్ స్క్రీన్ స్పేస్ లో 90% అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చి, మిగిలిన 10 శాతం స్క్రీన్ స్పేస్, టైం మాత్రమే ప్రతిపక్షాలకు ఇచ్చిన ఆ ఛానల్, దుబ్బాక ఫలితాల తర్వాత కాస్త రూటు మార్చింది. జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలకు ఇంకొక పది శాతం స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఇచ్చింది. అయినప్పటికీ అధికార టీఆర్ఎస్ పార్టీ చేసే వ్యాఖ్యానాలను ప్రముఖంగా ప్రసారం చేయడం, వారితో ఇంటర్వ్యూ ఇప్పించడం, తమ స్క్రోలింగ్ మరియు వార్తల ద్వారా ప్రజాభిప్రాయాన్ని సున్నితంగా టీఆర్ఎస్ వైపు మలచేలా ప్రయత్నం చేయడం వంటి అనేక విన్యాసాలు చేసింది. అయితే ప్రజాతీర్పు మాత్రం టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా వచ్చింది. ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ కు జీహెచ్ఎంసీ లో వందకు పైగా సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను ప్రముఖంగా రోజంతా స్క్రోలింగ్ ఇచ్చిన ఆ ఛానల్, అలా రాకపోయినప్పటికీ , ఏమాత్రం మొహమాట పడకుండా, ఫలితాలు వచ్చి మూడు రోజులు కాగానే మళ్లీ కేసీఆర్ భజన మొదలు పెట్టినట్టు కనిపిస్తోంది.

కెసిఆర్ ఢిల్లీ కి వ్యతిరేకంగా పోరాడుతున్నారని విపరీతంగా ప్రచారం కల్పిస్తూ, రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని హీరోల స్థాయిలో కెసిఆర్, బిజెపి నేతృత్వంలోని సెంటర్ ని గడగడలాడించ బోతున్నాడు అని కథనాలు ఉదర గొడుతోంది. కెసిఆర్ రౌద్రంగా చూస్తున్న ఫోటోలు, మోడీ అమిత్ షా ఏదో ఒక సందర్భంలో తలపట్టుకున్న ఫోటోలు మిక్స్ చేసి తమ ఎడిటింగ్ టాలెంట్ చూపిస్తోంది అగ్ర ఛానల్. సినిమా హీరోల వీడియోలకు కెసిఆర్ ఫేస్ ఫోటో లు అతికించి ఆ చానల్ చేస్తున్న వీడియోలు ప్రజలలో ఉద్వేగాన్ని రగిలించ కపోగా, పేరొందిన తెలుగు హాస్య సన్నివేశాలను తలదన్నేలా కామెడీ పండిస్తున్నాయి. .

ఇటీవలే చిరంజీవి కూడా ఆయా చానల్స్ ఎడిటింగ్లో నిష్ణాతులు అంటూ సెటైర్ వేసిన సంగతి తెలిసిందే. తాను 2008 లో ప్రజా అంకిత యాత్ర లో ఉన్నప్పుడు అభిమానులను కలిసి, వారితో మాట్లాడి, తన వాహనం లోకి వెళ్లి పోయిన తర్వాత తినడానికి ఎవరో ఖర్జూరాలు ఇస్తే, దాన్ని తినే ముందు తాను చేతిని శానిటైజర్ చేసుకున్న దృశ్యాలను వీడియోలో బంధించి, అభిమానులను కలుసుకున్న వీడియో తర్వాత ఉన్న మిగిలిన భాగం అంతా కట్ చేసి చివర్లో శానిటైజ్ చేసుకున్న వీడియో మాత్రమే అతికించి, అభిమానులను కలుసుకున్నందుకు చిరంజీవి చేతులు శానిటైజ్ చేసుకున్నాడని ,తనను బద్నాం చేసే కధనాలు కొన్ని చానల్స్ వండి వార్చాయి అని చెబుతూ ఆ చానల్స్ కు వాత లు పెట్టాడు చిరంజీవి. అప్పట్లో నడిచింది కానీ, ఇప్పటి సోషల్ మీడియా యుగంలో అలాంటివి పనిచేయవు అంటూ ముక్తాయించారు.

ప్రస్తుతం అగ్ర చానల్స్ కెసిఆర్ ను, మోడీకి వ్యతిరేకంగా గర్జించే హీరోలాగా చూపించడానికి తలకిందులుగా తపస్సు చేస్తున్నాయి. నిజంగా ఆ చానల్స్ కు ప్రజల పట్ల నిబద్ధత ఉంటే, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాజకీయ పార్టీల ఒత్తిడులకు భయపడకుండా చూపించే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ప్రజల పట్ల అంత కన్సర్న్ లేకపోయినా, ఉన్నది ఉన్నట్లు చూపిస్తే తమ పొరపాటును సమీక్షించుకుని అవకాశం కెసిఆర్ కు, టిఆర్ఎస్ పార్టీ కి దొరుకుతుంది. ఆ విధంగా అయినా కూడా అది తాము అభిమానించే అధికార పార్టీకి మేలే చేస్తుంది అన్న విషయం ఆయా ఛానల్స్ గుర్తిస్తే అటు ప్రజలతో పాటు ఇటు తాము అభిమానించే పార్టీలకు కూడా మంచి జరుగుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సుప్రీం చెప్పినా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదన్న వెంకట్రామిరెడ్డి..!

ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి .. ఎస్ఈసీ నిమ్మగడ్డను చంపే హక్కు కూడా ఉందన్నట్లుగా మాట్లాడి సంచలనం సృష్టించారు. ఇప్పుడు తన మాటలు వక్రీకరించారని చెప్పుకోవడానికి మీడియా ముందుకు వచ్చి మరింత వివాదాస్పదమైన...

వ్యాక్సినేషన్ ఉన్నా గుజరాత్‌లో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్..!

పంచాయతీ ఎన్నికల అంశం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఉత్కంఠకు కారణం అవుతోంది. వ్యాక్సినేషన్ వల్ల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో బలంగా వాదించాలని నిర్ణయించుకుంది. ఎన్నికలు జరపాలని అనుకుంటే వ్యాక్సినేషన్...

అప్పట్నుంచి గడ్డం తీసుకోని ఎల్వీ సుబ్రహ్మణ్యం..!

మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణం హఠాత్తుగా గుంటూరులో కనిపించారు. రామ మందిరానికి విరాళాలు సేకరించే ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. గబుక్కున ఆయనను చూసిన వారు చాలా మంది పోల్చుకోలేకపోయారు. ఎవరో స్వామిజీ ప్యాంట్,...

నిమ్మగడ్డ కింకర్తవ్యం..!?

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓ స్ట్రిక్ట్ ఐఏఎస్ అధికారిగా పని చేసుకుంటూ పోతున్నారు. ఓ రాజ్యాంగ వ్యవస్థకు అధిపతిగా తనకు ఉన్న అధికారాలను పక్కాగా ఉపయోగించుకుంటున్నారు. సర్వీస్ రూల్స్...

HOT NEWS

[X] Close
[X] Close