వర్మకు ఇంత ప్రచార ‘కర్మ’!

కర్మ అనే మాటకు కర్తవ్యం అన్న అర్ఠం భగవద్గీతలో కృష్ణుడే ఇచ్చాడు. రామ్‌ గోపాల్‌ వళర్మ తీసే సినిమాలు ఎప్పుడు వస్తాయో పోతాయో తెలియదు గాని దానికి ముందు వెనక మీడియా ఇచ్చే ప్రచారం మాత్రం కంపరం ఎత్తిస్తుంటుంది. శివతో సహా కొన్ని తెలుగు సినిమాలు మరికొన్ని హిందీ సినిమాలతో ఆయన దేశంలోనే సంచలనం కలిగించిన సంగతి ఇప్పుడు చరిత్ర మాత్రమే. రెండు దశాబ్దాలలోనూ ప్రధానంగా తక్కువ ఖర్చు ఎక్కువ ప్రచారం తో సినిమాలు తీస్తూ ఇతరుల చిత్రాలపై కామెంట్లు చేస్తూ నెట్టుకొస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో వ్యక్తిగత పొగడ్తలు తెగడ్దలతో సెక్సిస్టు రిమార్కులతో ఆయన వ్యూహాత్మకంగా వార్తలలో వుంటారు. ప్రతిభా వంతుడే కావచ్చు గాని వీటన్నిటితో తన స్థాయిని తనే తగ్గించుకున్నాడు. దయ్యాల సినిమాలు స్త్రీలను కించపర్చే చిత్రాలు తీసి ఒక దశలో తీవ్ర నిరసనకు కూడా గురైనాయి.నిర్మాతలు ముఖ్యంగా కొత్తవారినుంచి ఆయనపై ఫిర్యాదులు కూడా విన్నాను.వాటిపై విమర్శలకు కూడా తలాతోకలేని సమాధానాలిస్తుంటారు. బయోపిక్స్‌ గురించిన చర్చ పెరుగుతుంది గనక ఇప్పుడు వంగవీటి ప్రాజెక్టు తీసుకున్నారనుకోవాలి. నిజానికి తనే తీసిన శివ, గాయం వంటి వాటికన్నా తీసేందుకు ఇంకేమీ లేదు. చైతన్యరథం అచ్చంగా ఆ సోదరుల కథతోనే తీసి విజయం సాధించారు. ఇప్పుడు వర్మ దాన్ని మళ్లీ పట్టుకొని హడావుడి చేయడం హాస్యాస్పదం. ముందుగానే ఏదో ఆడియో క్యాసెట్‌ విడుదల చేయడం కూడా ఖర్చులేని ప్రమోషన్‌ ప్రహసనమే. పరిశ్రమలో ఎందరో శక్తివంతులు సృజన కారులు వుండగా ఒక్క వర్మ చుట్టూనే మీడియా సంస్థలుకొన్ని పరిభ్రమించడంలో పరమ రహస్యం ఏమిటో తెలియదు. తను సేలబుల్‌ అన్న ఒక్క సూత్రమే పనిచేస్తుందా? వీటి వల్ల గతంలో ఆడని సినిమాలు జరగని విచిత్రాలు ఇప్పుడు మాత్రం జరుగుతాయా? అవన్నీ ఎలా వున్నా ప్రచారం ప్రమోషన్‌ వుంటాయి గనక ఎవరైనా ‘బకరాలు’ దొరకొచ్చు కూడా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గంటాను వైసీపీలో చేరకుండా అడ్డుకునే శక్తి ఆ ఇద్దరికి ఉందా..?

గంటా శ్రీనివాసరావు పార్టీ మారబోతున్నరాని.. వైసీపీలో చేరబోతున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సహజంగా అయితే... టీడీపీలో ఇది కలకలం రేపాలి. కానీ.. టీడీపీలో అందరూ నింపాదిగా.. గంటా వెళ్తేనే మంచిదన్నట్లుగా ఉన్నారు. కానీ.....
video

క‌న‌బ‌డుట‌లేదు టీజ‌ర్‌: క్రియేటివిటీ క‌నిపించింది

https://www.youtube.com/watch?v=9Lg-QFxx5To చిన్న సినిమాకి హంగు - ఆర్భాటాలూ ఏం ఉండ‌వు. క‌థే దాని బ‌లం. ప్రచారంతోనే జ‌నాన్ని ఆక‌ర్షించాలి. టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఎంత వెరైటీగా కట్ చేస్తే - అంత‌గా జ‌నం దాని గురించి...

అమరావతి కోసం బీజేపీ ఎవరిపై పోరాడుతుంది..!?

అమరావతి రాజధాని అనేది బీజేపీ విధానం అని... రాజధాని రైతుల కోసం పోరాడుతామని.. భారతీయ జనతా పార్టీ నేతలు... వారి మిత్రపక్షం.. జనసేన చెబుతోంది. అయితే.. వారు ఎవరిపై పోరాడతారన్నదానిపై క్లారిటీ...

“స్టేటస్‌కో ” పై సుప్రీంకోర్టుకు ఏపీ సర్కార్..!

పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుల అమలుపై స్టేటస్ కో విధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ స్టేటస్...

HOT NEWS

[X] Close
[X] Close