చైతన్య: క్యారెక్టర్ లేనిది ఎవరికి ? మీడియాకా ? పవిత్రాకా ?

నరేష్ – పవిత్ర లోకేష్ అంశంపై తెలుగు మీడియా చేస్తున్న హడావుడి కాస్త బుద్ది, జ్ఞానం ఉన్న వారిని ఆశ్చర్య పరుస్తోంది. నరేష్ – పవిత్ర ఒకే హోటల్లో దొరికారని..మరొకటని రచ్చ రచ్చగా వార్తలు ప్రసారం చేస్తున్నారు. నిజానికి వారు చేస్తున్న దాంట్లో చట్టపరంగా ఎలాంటి తప్పు లేదు. నైతిక పరమైన విలువలు నిర్దేశించే అధికారం మీడియాకు లేదు. వారిద్దరూ వారి వారి వ్యక్తిగత జీవితాలను ఎలాగైనా గడపడానికి వారికి సంపూర్ణ స్వేచ్చ ఉంది. నరేష్ మూడో భార్యను పెళ్లి చేసుకుని మోసం చేసి ఉంటే ఖచ్చితంగా దాన్ని మీడియా ఎండగట్టాలి. కానీ ఇక్కడ మీడియా అది చేయడం లేదు.

నరేష్ – పవిత్రల వ్యక్తిగత జీవితంపై తీర్పు ఇచ్చే హక్కు ఎవరిచ్చారు ?

పవిత్రా లోకేష్‌తో ఎలా కలిసి ఉంటాడు ? ఎప్పటి నుండి కలిసి ఉన్నారు ? పవిత్ర మాజీ భర్తలెవరు ? వారి మధ్యఎఫైర్స్ ఎలా ఉండేవి అంటూ రకరకాల కథనాలు వండిస్తోంది. సీనియర్ జర్నలిస్టులమని.. నైతికంగా పతమైన వారు చెప్పే ముచ్చట్లలో కూడా పవిత్రా లోకేష్ క్యారెక్టర్‌ను దారుణంగా కించ పరిచేలా రాస్తున్నారు. ఓ మహిళ జీవితాన్ని రూమర్స్‌తో ముడిపెట్టేసి ఆమెది దారుణమైన క్యారెక్టర్ అని ముద్ర వేయడానికి ఎందుకు ఆలోచన లేకుండా పరుగులు పెడుతున్నారో కానీ.. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది. వారి జీవితంలోనూ అనేక ఆటుపోట్లు ఉంటాయి. వారికి ఉన్న దారిలో వారు నడుస్తారు. అది ప్రైవసీ. ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు.

వాళ్ల జీవితాలకు వాళ్లే బాధ్యులు .. మీడియాకు ఎందుకు ?

అయితే ఆమె లేదా నరేష్ ఎవరైనా ఇతరులను మోసం ఉంటే ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు. కానీ ఇక్కడ అది జరగడం లేదు. స్టింగ్ ఆపరేషన్లు చేసేవారు కొందరైతే.. ఇష్టారీతిన క్యారెక్టర్లపై నిందలేసేవారు కొందరు. తమను తాను నైతిక విలువలను కాపాడే వ్యక్తులుగా ఊహించుకుంటూ వారిపై దాడికి ఎగబడుతున్నారు. తమకు మీడియా నైతిక విలువలు ఉన్నాయా లేవా అన్నది మాత్రం చూసుకోవడం లేదు. వాళ్ల జీవితం వాళ్లది.. దాని వల్ల నష్టపోయిన వాళ్లు మాత్రమే న్యాయపోరాటం చేసుకుంటారు. కానీ మీడియామధ్యలో తీర్పులెందుకు చెబుతోంది.

క్యారెక్టర్ లేనిది మీడియాకా ? ఆ జంటకా ?

నరేష్ లేదా పవిత్ర తప్పు చేస్తే ఆ విషయాన్ని మీడియా చెప్పొచ్చు. అంతే కానీ వారి క్యారెక్టర్లకు బ్యాడ్ ఆర్ గుడ్ సర్టిఫికెట్లు జారీ చేయడం … సినిమా వాళ్లు కదా అని ఇష్టారీతిన నిందలేసి ప్రచారం చేయడం.. తగని పని.కానీ రేటింగ్‌ల మాయలో పడిన అనని మీడియాలదీ అదే దారి. ఎవరు ఎలా అయితే మనకేంటి.. మనకు రేటింగ్స్ వస్తున్నాయా లేదా అన్నదే ముఖ్యం. అందుకే ఇక్కడ క్యారెక్టర్ గురించి చర్చ జరగాలంటే.. ముందుగా మీడియా గురించే చర్చ పెట్టాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ని వెంటాడుతున్న `రెబ‌ల్‌` భ‌యం

స‌లార్ రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది. సెప్టెంబ‌రు 28, 2023న ఈ సినిమాని రిలీజ్ చేస్తామ‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. దాంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ హ్యాపీ ఫీలైపోయారు. ఎందుకంటే ఇలాంటి అప్ డేట్ కోస‌మే వాళ్లు...

కులాల లెక్కలేసుకుంటే జనసేనకు 40 సీట్లొచ్చేవి : పవన్

కుల , మతాలు లేని రాజకీయం రావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. మంగళగిరిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జెండా ఆవిష్కరించిన తర్వాత మాట్లాడారు. ఈ సందర్భంగా కుల, మతాల...

‘స‌లార్’ అప్‌డేట్‌: రిలీజ్ డేట్ ఫిక్స్‌

ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఎప్ప‌టి నుంచో.. ఎదురుచూస్తున్న అప్ డేట్ వ‌చ్చేసింది. 'స‌లార్‌' రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది. 2023 సెప్టెంబ‌రు 28న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ...

బింబిసార విజయ రహస్యం ఇదేనా?

కరోనా తర్వాత ప్రేక్షకులు థియేటర్ కి రావడం తగ్గిపోయిందనే మాట సర్వాత్ర వినిపిస్తోంది. దీనికి కారణం ఓటీటీ ప్రభావమని కొందరంటే.. సినిమా టికెట్ రేట్లు ఇష్టం వచ్చినట్లు పెంచి మళ్ళీ తగ్గించి ప్రేక్షకుడికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close