అవినీతి కేసుల్లో ఇరుక్కున్నాడు. అవన్నీ ఆరోపణలేనేమో అని అనుకుందామా అంటే అలాంటి అనుమానాలేం పెట్టుకోవద్దని బెయిల్ కోసం తను చేసిన అవినీతి ప్రయత్నాలతో నిరూపించుకున్నాడు. గాలి జనార్థన్‌రెడ్డి అవినీతిపరుడు, అక్రమ మార్గాలలో డబ్బు సంపాదించాడు, దోచుకున్నాడు అని చెప్పడానికి ఎవరికీ ఎలాంటి సందేహాలూ ఉండనక్కర్లేదు. గాలి జనార్థన్‌రెడ్డి, వీడియో సాక్ష్యాలతో సహా దొరికేసిన రేవంత్‌రెడ్డిలాంటి వాళ్ళను ఎవరైనా ఎలా చూడాలి?
భారతదేశం నుంచి అవినీతిని తరిమికొట్టడానికి లక్షా తొంభై మార్గాలుంటే ఉండొచ్చుగాక. కానీ అన్నింటికంటే…. అన్నింటినీ మించిన మార్గం ఒకటి ఉంది. అది ఎలాంటి తప్పు అయినా, ఏ తప్పు అయినా సరే…. తప్పు చేసినవాళ్ళను దూరంగా పెట్టాలి. సమాజం మనల్ని బహిష్కరిస్తుందేమో, మనల్ని తక్కువ చూపు చూస్తారేమో అన్న భయం తప్పు చేయాలనుకున్న వాళ్ళ, తప్పుచేసిన వాళ్ళ ఆలోచనల్లో కలిగేలా చేయాలి. ఆ ఒక్క విషయంలో కరెక్ట్‌గా ఉంటే చాలు. ఒక్క అవినీతి అనే కాదు…సమాజానికి పట్టిన అన్ని దరిద్రాలూ తొలగిపోతాయి. కానీ మన మీడియావాళ్ళు మాత్రం డబ్బు, అధికారం, రాజకీయాలకే ప్రథమ ప్రాధాన్యతనిచ్చేస్తున్నారు. అవినీతి, అక్రమాలతో పరువు మొత్తం పోగొట్టుకున్న గాలివారు…ఇప్పుడదే అవినీతి సొమ్ముతో అంగరంగ వైభవంగా ఓ పెళ్ళి కార్యక్రమం చేద్దామనుకుంటున్నారు. ఆ పెళ్ళి గురించి మీడియాలో అదిరిపోయే రేంజ్లో కవరేజ్ ఉండాలి. అతిరథమహారథులందరూ గాలివారితో ఫొటోలు దిగాలి. గాలివారి పరపతి, పేరు పది రెట్లు పెరిగేలా చేయాలి. ఇది ఫైనల్ టార్గెట్. ఆల్రెడీ గ్రేటాంధ్రవారు గాలి భజన స్టార్ట్ చేశారు. సాక్షిలో కూడా చిన్న చిన్నవార్తలు వస్తున్నాయి. టిడిపి నాయకుడొకాయన గాలితో ఫొటో దిగి వచ్చారు. గాలి జనార్థన్‌రెడ్డితో టిడిపి, బిజెపి, జగన్ పార్టీల్లో ఉన్న నాయకుల్లో చాలా మందికి మంచి ‘సం’బంధాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. అవన్నీ గాలివారు జైలుకు వెళ్ళకముందు వ్యవహారాలు అనే అనుకుందాం. కానీ ఇప్పుడు మాత్రం జగన్, సుష్మాస్వరాజ్, వెంకయ్యనాయుడులతో పాటు తెలుగు సినిమా హీరోలు, నాయకులు, ప్రముఖులందరూ కూడా గాలివారికి దూరంగా ఉండాల్సిందే. అవినీతి పరులకు దగ్గరగా ఉన్నవాళ్ళకు కూడా అలాంటి శిక్షే పడాలి. అలా చేయడం తప్పా? ఒప్పా? అన్న ప్రశ్న అనవసరం. అవినీతిని తరిమేస్తాం, చంపేస్తాం అని సోషల్ మీడియాలోనో, మీడియాలోనో, బహిరంగ సభల్లోనో అరుస్తూ ఉంటే అవినీతి పోదు కదా. అవినీతి, అక్రమాలకు పాల్పడేవాళ్ళను సమాజం కూడా శిక్షిస్తుంది అన్న విషయం వాళ్ళకు అర్థం అయ్యేలా చేయాలి. అదే జరిగితే సామాన్యులను ఇబ్బంది పెట్టే చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేకుండానే సమాజాన్ని పట్టిపీడిస్తున్న సకల సమస్యలూ పరిష్కారమయిపోతాయి. తప్పు చేసినవాడు తలవంచక తప్పదు అన్న సందేశాన్ని ఎంత బలంగా వినిపిస్తే ఆ సమాజం అంత బ్రహ్మాండంగా ఉంటుంది.
హెచ్చరికః గాలివారి ఇంటి పెళ్ళికి వైఎస్ జగన్‌కానీ లేదా ఆయన ఇంటి మనుషులు, పార్టీ మనుషులు ఎవ్వరైనా హాజరయితే మాత్రం… జగన్‌కి బాగా ఇష్టమైన బంగాళాఖాతంలో వైకాపానే కలిసిపోవడం ఖాయం.