మీడియా చేతుల మీదుగా… దిల్‌రాజు రెండో పెళ్లి!

ప్ర‌భాస్ పెళ్లెప్పుడు?
రానా పెళ్లెప్పుడు?
అనుష్క పెళ్లెప్పుడు..?

ఎంచ‌క్కా… ఇలాంటి విష‌యాలు మాట్లాడుకునేవాళ్లం. టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ చాలామందే ఉన్నారు. వాళ్ల పెళ్లి క‌బురు వినాల‌ని అభిమానుల ఆశ‌. అందుకే ఈ టాపిక్కు ఎన్నిసార్లు మాట్లాడుకున్నా – హాయిగానే ఉండేది. మీడియావాళ్లే `ఇదిగో.. అదిగో..` అంటూ పెళ్లి క‌బుర్ల‌ని చిల‌వ‌లు ప‌ల‌వ‌లుగా ప్ర‌చారం చేసింది. కొంత‌మంది సెల‌బ్రెటీల విష‌యంలో `పెళ్ల‌యిపోంది` అంటూ తొంద‌ర‌ప‌డి ప్ర‌చారం చేసింది. అయితే ఈమ‌ధ్య యాభై ఏళ్లు నిండిన ఓ తాత‌య్య రెండో పెళ్లి క‌బురు ముందు… ఈ మోస్ట్ బ్యాచిల‌ర్ వ్య‌వ‌హారాల‌న్నీ గాలికి కొట్టుకువెళ్లిపోయాయి. ఆయ‌నే దిల్‌రాజు.

ఈమ‌ధ్య ఏ ఇద్ద‌రు సినిమావాళ్లు క‌లుసుకున్నా దిల్‌రాజు రెండో పెళ్లి సంగ‌తులే. ఇంత‌కీ ఈ అమ్మాయి ఎవ‌రు? దిల్‌రాజుతో ఎప్ప‌టి నుంచి ప‌రిచ‌యం? ఇద్ద‌రూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు… ఇదే గోల‌. ప్ర‌భాస్ పెళ్లి ఎప్పుడు? అనే ప్ర‌శ్న కంటే… దిల్‌రాజు రెండో పెళ్లి వ్య‌వ‌హార‌మే హాట్ టాపిక్ అయ్యి కూర్చుంది. ఈమ‌ధ్య ఈ పుకార్లు మ‌రింత బ‌లం పుంజుకున్నాయి. దిల్‌రాజు రెండో పెళ్లి ర‌హ‌స్యంగా అయిపోయిందంటూ ఓ ప్రింట్ మీడియా సంస్థ క‌థ‌నం వండి వార్చింది. దాంతో.. సినిమా ఇండ్ర‌స్ట్రీ వాళ్లు షాక్ తిన్నారు. `పెళ్లికి పిల‌వ‌లేదేంటి చెప్మా` అంటూ ఆశ్చ‌ర్య‌పోయారు. రిసెప్ష‌న్‌కి పిలుపు వ‌స్తుందేమో అని కళ్లు కాయ‌లు కాచేలాఎదురుచూస్తున్నారు. నిజానికి దిల్ రాజు రెండో పెళ్లి ఇంకా జ‌ర‌గ‌లేదు. కానీ… మీడియా వాళ్లే రెండో పెళ్లి చేసిన‌ట్టైంది. ఈ పెళ్లి విష‌యంలో ఇంకా దిల్‌రాజు కుటుంబంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. అయినా పెళ్లి అనేది చాలా వ్య‌క్తిగ‌త‌మైన వ్య‌వ‌హారం. అది అవ్వ‌క‌ముందే ర‌క‌ర‌కాల క‌థ‌నాలు, గాసిప్పులు పుట్టించేస్తున్నారు. ఇలాంటి విష‌యంలో మీడియా కూడా కాస్త సంయ‌మ‌నం పాటిస్తే బాగుంటుంది. దుర‌దృష్ట‌వ‌శాత్తూ అదే క‌నిపించ‌డం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com