టీనేజ్ వయసులోనే సింహాద్రి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్‌కి ఆ సక్సెస్‌ని నిలబెట్టుకోవడం…అంతకంటే ఎక్కువ స్థాయికి ఎదగడం మాత్రం చేతకాలేదు. చాలా కాలం వరకూ కూడా రాజమౌళి, వినాయక్‌ల చుట్టూ తిరిగాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ వయసు చాలా చిన్నది కావడంతో వినాయక్, రాజమౌళిలను సొంత బ్రదర్స్‌లా భావించేవాడు. వాళ్ళిద్దరే తన ఇమేజ్‌ని ఇంకా పెరిగేలా చేస్తారని ఆశించాడు. అప్పట్లో కథల ఎంపిక విషయంలో కూడా ఎన్టీఆర్‌కి సరైన జడ్జ్మెంట్ ఉండేది కాదు. రాజమౌళి రేంజ్ పెరిగిపోవడం, వినాయక్ క్రేజ్ తగ్గిపోవడంతో వేరే ఆప్షన్స్ కోసం చూశాడు ఎన్టీఆర్. ఎవరితో సినిమా చేయాలన్న విషయంలో బోలెడన్ని కన్ఫ్యూషన్స్ ఉండడంతో హిట్ ఇచ్చిన డైరెక్టర్స్ వెంటపడ్డాడు. ఆ ప్రయత్నంలో అన్నీ ఎదురుదెబ్బలే తిన్నాడు. గట్టి విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.
గట్టి దెబ్బలు తిన్నాకే ఆలోచనల్లో పరిణతి పెరిగిందని ఎన్టీఆరే చెప్పుకొచ్చాడు. తనలో వచ్చిన మార్పుని టెంపర్ సినిమా నుంచి చూపిస్తున్నాడు ఈ నందమూరి హీరో. ప్రతి ప్రాజెక్ట్‌ని కూడా జాగ్రత్తగా ఎంచుకుంటున్నాడు. వక్కంతం వంశీ కథను డైరెక్ట్ చేయడానికి పూరీని ఒప్పించాడు. ఆ తర్వాత కూడా డిజాస్టర్ ఇచ్చిన సుకుమార్‌తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అలాగే వేరే హీరోతో సినిమా చేయడం గురించి ఆలోచిస్తున్న కొరటాల శివను స్వయంగా కలిసి తనతో ‘జనతా గ్యారేజ్’ సినిమా చేసేలా కన్విన్స్ చేశాడు ఎన్టీఆర్. ఆ ప్లానింగ్ మొత్తం కూడా ఎన్టీఆర్ క్రేజ్‌ని అమాంతం పెంచేసింది. రెండు సంవత్సరాల గ్యాప్‌లో మళ్ళీ నంబర్ ఒన్ రేసులోకి వచ్చేలా చేసింది.
అందుకే ఎన్టీఆర్ కూడా జాగ్రత్తపడుతున్నాడు. సింహాద్రి టైంలో చేసిన తప్పులను ఇప్పుడు రిపీట్ చేయకూడదని అనుకుంటున్నాడు. వక్కంతం వంశీ చెప్పిన బేసిక్ స్టోరీ నచ్చినప్పటికీ ఫుల్ స్క్రిప్ట్ విషయంలో నమ్మకం లేకపోవడంతో కేన్సిల్ చేసేశాడు. అలాగే పూరీ జగన్నాథ్ కెరీర్లోనే ఎప్పుడూ లేనంతగా చాలా రోజులపాటు ఆయనతో స్క్రిప్ట్ వర్క్ చేయిస్తున్నాడు తారక్. వరుసగా పూరీతో స్టోరీ సిట్టింగ్స్‌లో కూర్చుంటున్నాడు. అవసరమైతే కొన్ని నెలలు గ్యాప్ తీసుకుని అయినా సరే ది బెస్ట్ స్క్రిప్ట్‌తోనే సెట్ప్పైకి వెళ్ళాలన్న ఆలోచనలో ఉన్నాడు. ఎన్టీఆర్‌కి సంబంధించినంత వరకూ ఆయన ఆలోచనల్లో అస్సలు తప్పులేదు. వక్కంతం వంశీతో మంచి రిలేషన్ ఉందని చెప్పి మొహమాటం కోసం సినిమా చేసినా, పూరీని నమ్మి బ్లైండ్‌గా బరిలోకి దిగినా రిజల్ట్ తేడా వస్తే ఎన్టీఆర్‌ని నమ్ముకుని సినిమా బిజినెస్‌లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళతో పాటు ప్రేక్షకులను కూడా హింసించినవాడవుతాడు. ఎన్టీఆర్ ఎందుకు స్పీడ్‌గా సినిమాలు చేయడు అని ఇఫ్పుడు ప్రశ్నించే వాళ్ళే… ఒక్క ఫ్లాప్ పడగానే… బాధ్యతగా ఉండకపోతే ఎలా? జడ్జ్మెంట్ స్కిల్స్ లేవా? అని కొత్తరాగం మొదలెడతారు. అలాగే త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్‌కి ఏవేవో ఇష్యూస్ ఉన్నాయని కూడా కొంతమంది రాతలు రాస్తున్నారు. ఎం.ఎస్.రెడ్డి-ఎన్టీఆర్ ఇష్యూలో జరిగిన ఇన్సిడెంట్ లాంటిదే త్రివిక్రమ్‌తో కూడా జరిగినట్టుగా ఊహించేసి వార్తలు వండుతున్నారు. ఆల్రెడీ త్రివిక్రమ్ వేరే సినిమాలకు కమిట్ అయి ఉన్న ఒక్క కారణం తప్పితే ఎన్టీఆర్-త్రివిక్రమ్‌ల సినిమా పట్టాలెక్కకపోవడానికి వేరే రీజన్ ఏమీ లేదు. ఫ్యూచర్లో ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయడం ఖాయం. సినిమా ఫ్లాప్ అయితేనో, లేక తప్పులు చేస్తేనో విమర్శలు చేయవచ్చు. కానీ చాలా ఎక్కువ టైం, జాగ్రత్తలు తీసుకుని అయినా ప్రేక్షకులకు, అభిమానులకు బాగా నచ్చే సినిమానే చేద్దాం అని ఆలోచించడం కూడా తప్పేనా?