ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజ్‌కు వచ్చిన పగుళ్లు బీఆర్ఎస్ పార్టీ పునాదులు కదిలించేశాయి. అలా రావడం వల్ల లక్ష కోట్లు నష్టపోయామని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. అది చాలా చిన్నదని .. రిపేర్లు ఎందుకు చేయరని బీఆర్ఎస్ ప్రశ్నిస్తూ వస్తోంది. చివరికి కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డకు రిపేర్లు చేయాలని నిర్ణయించుకుంది. మేడిగడ్డ కుంగిన తర్వాత అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ సీపేజీలు బయటపడ్డాయి. ఈ మూడు బ్యారేజీల్లో నీటిని నిల్వ చేసే అవకాశం లేకుండా పోయింది. చివరికి వాటిని రిపేర్ చేయించాలని నిర్ణయించారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ, మరమ్మతు పనులను నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఇచ్చిన సూచనల మేరకు చేపట్టాలని నిర్ణయించారు. ఈ బ్యారేజీల పునరుద్ధరణకు అవసరమైన డిజైన్లు, డ్రాయింగులు సిద్ధం చేసేందుకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఎన్డీఎస్ఏ రిపోర్టులో బ్యారేజీల నిర్మాణం, డిజైన్లు, నాణ్యత, నిర్వహణ సహా అనేక వైఫల్యాలున్నట్లు స్పష్టంగా గుర్తించింది. అందుకే నిపుణులైన అంతర్జాతీయ సంస్థలను సైతం ఆహ్వానించి. పునరుద్ధరించాలని ్నుకుంటున్నారు.
బ్యారేజీల డిజైన్లు, డ్రాయింగులు సిద్ధమైతేనే అసలు రిపేర్ పనులు ప్రారంభమవుతాయి. ఈ అక్టోబర్ 15 గ తరువాత, కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు, పనుల ప్రణాళికలు వెల్లడవుతాయి. వచ్చే సీజన్ కల్లా కంప్లీట్ చేసి.. నీరు నిల్వ చేసే అవకాశం ఉంది. మేడిగడ్డ కుంగుబాటు, మూడు బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేయలేకపోవడం వల్ల ఆ ప్రాజెక్టు పూర్తిగా నిరుపయోగంగా మారింది.
