అదేదో సినిమాలో ‘ చెల్లికి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ’ అంటాడు తనికెళ్ల భరణి. ‘చెల్లికి మళ్లీ పెళ్లి చేయడమేంట్రా సుంఠా’ అంటూ మనసులోనే తిట్టుకొంటాడు మరో కమెడియన్. తెలుగు సినిమా పెళ్లిళ్లు మాత్రం మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఏ బంధమూ శాశ్వతం కాదు. అన్నీ కాగితపు పూలే. వారానికి థియేటర్లో ఓ బొమ్మ మారినట్టు.. బంధాలు, అనుబంధాలు, ప్రేమలూ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఒక పెళ్లికీ, ఓ బంధానికే పరిమితమైన వాళ్లు చిత్రసీమలో అతి తక్కువగా కనిపిస్తుంటారు. సినిమాల్లో పద్దతిగా, పవిత్రంగా కనిపించిన కథానాయికలు సైతం జోడీలు మార్చి.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తుంటారు. మీరా జాస్మిన్ కథ అలాంటిదే. తెలుగు, మలయాళ భాషల్లో చాలా డీసెంట్ యాక్ట్రస్ అనిపించుకొంది మీరా. ఒక్క అంగుళం కూడా నడుం కనిపించకుండా అత్యంత పద్దతిగా నటిస్తుంటుంది. అయితే నిజ జీవితంలో మాత్రం మీరా చాలా హాట్. ఇప్పటికి మీరాకు రెండు పెళ్లిళ్లు జరిగాయి. హీరోయిన్ గా ఊపు మీదున్నప్పుడు మాండలిన్ రాజేష్ అనే సంగీత విధ్వాంసుడిని పెళ్లి చేసుకొంది. అయితే అనతి కాలంలోనే ఈ బంధం బీటలు వారింది. వీరిద్దరూ విడాకులు తీసుకొని.. ఎవరి దారి వాళ్లు చూసుకొన్నారు. ఒంటరిగా బతకడం కష్టం అనుకొందో ఏమో… మాండలిన్కి విడాకులు ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే అనిల్ జాన్ టైటస్ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకొంది పెళ్లాడింది మీరా. అయితే మీరా లానే జాన్‌కి రెండో వివాహం. అప్పట్లో మీరా – జాన్‌ల పెళ్లి పెద్ద సన్సేషన్. చాలా గొడవలూ జరిగాయి. అయితే ఇప్పుడు వీళ్లూ విడాకులు తీసుకోవడానికి రెడీ అవుతున్నారని టాక్.
యేడాది కాలంగా మీరా, జాన్ ఇద్దరూ వేరు గా ఉంటున్నార్ట. విడాకుల కోసం అప్లై కూడా చేశారని, త్వరలోనే విడాకుల పత్రాలు అందే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎప్పుడైతే మీరా – జాన్‌ల విడాకుల వ్యవహారం బయటకు వచ్చిందో.. అప్పుడే మీరాకు మరో ఎఫైర్ కూడా ఉందన్న ప్రచారం ఊపందుకొంది. ఈ విడాకుల తరవాత మీరా ముచ్చటగా మూడో పెళ్లి చేసుకోవడానికి సిద్దమైందని, ఈసారీ వ్యాపార వేత్తనే తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలని చూస్తోందట. జరగాలి మళ్లీ పెళ్లి అనేది మనం కామెడీగా తీసుకొన్నా.. సినిమా వాళ్లు మాత్రం చాలా సీరియస్‌గా తీసుకొన్నట్టున్నారు. ఏంటో ఈ ‘చిత్ర’ ప్రపంచం!