చికాగోలో ఘనంగా శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి మీట్ అండ్ గ్రీట్

మాజీ డిప్యూటీ స్పీకర్ మరియు మంత్రివర్యులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారి చికాగో పర్యటన సందర్భంగా ఎన్ ఆర్ ఐ టీడీపీ అమెరికా కోఆర్డినేటర్ శ్రీ కోమటి జయరాం గారి పర్యవేక్షణలో, స్థానిక టీడీపీ నాయకులు శ్రీ హేమ కానూరు గారి ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించగా టీడీపీ అభిమానులు, ప్రవాసాంధ్రులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి శ్రీ యుగంధర్ యడ్లపాటి గారు అధ్యక్షత వహించగా, మురళి మేరుగ గారు శాలువాతో బుద్ధ ప్రసాద్ గారిని సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా బుద్ధ ప్రసాద్ గారు అభిమానులను ఉద్దేశిస్తూ వర్తమాన రాజకీయాలతో పాటుగా తెలుగు జాతి వైభవాన్ని గుర్తు చేస్తూ అనేక ప్రముఖులు మరియు అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారి హయాంలో తెలుగు జాతికి లభించిన గుర్తింపు నుంచి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన అభివృద్ధి వరకు ప్రస్తావించడం జరిగింది.

అలాగే ప్రవాసాంధ్రులకి పిలుపునిస్తూ తెలుగు జాతి ఔనత్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను, గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పథంలో నడిపించగల నాయకుడిని గెలిపించుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ ప్రసంగాన్ని ముగించారు. ఈ కార్యక్రమాన్ని ఎన్ అర్ ఐ టీడీపీ చికాగో ప్రతినిధులు రవి కాకర, చిరంజీవి గల్లా, కృష్ణ మోహన్, హను చెరుకూరి, శివ త్రిపురనేని, వినోజ్ చనుమోలు, రఘు చిలుకూరి, కిషోర్ త్రిపురనేని, పవన్ నల్లమల్ల తదితరులు సమన్వయపరిచి విజయవంతం అవ్వడంలో తోడ్పడ్డారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోస్ట‌ర్‌తోనే పోలిక‌లు మొద‌లా?

రాజ‌మౌళి సినిమాలు ఎంత గొప్ప విజ‌యాన్ని సాధిస్తాయో, రాజ‌మౌళికి, అత‌ని టీమ్ కీ ఎంత పేరు తీసుకొస్తాయో.. మిగిలిన వాళ్ల‌కు అంత ప‌రీక్ష‌గా మిగిలిపోతాయి. భారీ సినిమా ఏదొచ్చినా రాజ‌మౌళి సినిమాల‌తో పోలిక‌లు...

జగన్ కుటుంబంలో చిచ్చుకు సజ్జలే కారణమంటున్న టీఆర్ఎస్ !

ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న హరీష్ రావుకు.. కేసీఆర్‌తో గొడవలు ఉన్నాయని సజ్జల చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ నేతలకు ఆగ్రహం తెప్పించాయి. అసలు జగన్ కుటుంబం ఇలా చీలికలు పేలికలు అయిపోవడానికి...

వినతి పత్రాన్ని వీఆర్‌ఏల మీదే విసిరికొట్టిన కేసీఆర్ !

సీఎం కేసీఆర్‌కు కోపం వచ్చింది. అది చిన్న కోపం కాదు. సీఎంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని స్థిరచిత్తంతో ఉండాల్సిన కేసీఆర్ ఒక్క సారిగా తన చేతిలో ఉన్న వినతి పత్రాన్ని విసిరికొట్టారు. అదీ...

సీబీఐ కేసులో స్టే తెచ్చుకున్న రఘురామ !

ఇండ్ భారత్ కంపెనీల ద్వారా బ్యాంకులకు పెద్ద మొత్తంలో అప్పులు చేసి ఎగ్గొట్టిన వ్యవహారంలో తన కంపెనీలపై జరుగుతున్న విచారణపై రఘురామ ఊరట పొందారు. సుప్రీంకోర్టు సీబీఐ కేసు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close