చీలికే చతికిలా పడేలా చేసిందా..?

మెగా ఫ్యామిలీలో గొడవలు ఇప్పుడు సినిమా రిజల్ట్ మీద కూడా ప్రభావం చూపిస్తుందా అంటే అవుననే అంటున్నాయి కొన్ని వర్గాలు. మెగా ఫ్యామిలీ అంతా ఒకే తాటిపై ఉన్న తరుణంలో పవర్ స్టార్ కి విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడం.. జనసేన పార్టీ పెట్టడం అంతా చకచక జరిగిపోయాయ్. అయితే మెగాస్టార్ ని టార్గెట్ చేసినట్టుగా కొన్ని కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్ మాటలు అప్పట్లో కొన్ని గొడవలకు దారి తీసింది. అయినా మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే మెగా హీరోలంతా ఒక్కటే అని చెప్పే ప్రయత్నాలు చేశారు.

రీసెంట్ గా మెగాస్టార్ పుట్టినరోజు వేడుకల్లో మెగా బ్రదర్ నాగబాబు పవర్ స్టార్ ఫ్యాన్స్ మీద.. పవన్ కళ్యాణ్ మీద.. విరుచుకు పడ్డ సంగతి తెలిసిందే. పవన్ మాకు తమ్ముడు, తర్వాతే మీ అభినాన నటుడు అంటూ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు నాగబాబు. ఆ మాటలతో మెగా ఫ్యాన్స్ ఓ చీలిక వచ్చిందనే భావనకు ఊతమిచ్చాడు. ఇవేమీ పట్టించుకోక పోయినా రీసెంట్ గా వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నా మెగా ఫ్యాన్స్ పుణ్యమాని సూపర్ హిట్ అవ్వాల్సి ఉంది. కాని ఈ సినిమాను పవర్ స్టార్ ఫ్యాన్స్ చూడకుండా బాయ్ కాట్ చేయడం వలనే సినిమా కలెక్షన్స్ అంతగా రావట్లేదనే టాక్ వస్తుంది.

ముఖ్యంగా చెప్పుకోవాలంటే మెగా ఫ్యాన్స్ తలచుకుంటే యావరేజ్ సినిమానైనా సూపర్ హిట్ చేసేస్తారు కాని పవర్ స్టార్ ఫ్యాన్స్ బ్రూస్ లీని చూడకపోవడం కలెక్షన్ల మీద దెబ్బేసిందని అంటున్నారు. అందుకే సినిమా డివైడ్ టాక్ వచ్చిన కారణం చేతే రిలీజ్ అయిన తర్వాత రోజే పవర్ స్టార్ ని వెతుక్కుంటూ వెళ్లి సినిమా గురించి మాట్లాడేలా చేశాడు చరణ్. పవన్ కళ్యాణ్ అభినందనలతో సినిమాను పవార్ స్టార్ ఫ్యాన్స్ కూడా చూస్తారనే భావన.

అయితే ఇదే సీన్ అప్పట్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయంలో జరిగింది. దమ్ము సినిమా ముందు దాకా నందమూరి అభిమానులంతా ఎన్టీఆర్ ని తమ అభిమాన నటుడని ఆరధించి అభిమానించారు. కాని ఎప్పుడైతే బాలయ్యకు విరుద్ధంగా సంకేతాలను వదిలాదో ఎన్టీఆర్ ని కూడా నందమూరి ఫ్యాన్స్ దూరం పెట్టడం స్టార్ట్ చేశారు. ఇప్పటికీ మేమంతా ఒక్కటే అని అన్న కళ్యాణ్ రామ్ చేత చెప్పిస్తున్నా అప్పట్లో ఏర్పడ్డ ఆ దూరపు లోటుని తీర్చలేకపోతున్నారు నందమూరి హీరోలు. ఇప్పటికీ తన సినిమాలను 50 కోట్ల మార్క్ ని కూడా దాటించలేకపోతున్నాడు ఎన్టీఆర్.

ఇక బ్రూస్ లీ విషయానికొస్తే మెగా ఫ్యాన్స్ లో చీలికే సినిమా చతికిల పడేలా చేసిందన్న కారణాలు స్పష్టంగా వెళ్లడవుతున్నా.. ఈ సందర్భాన్ని వదిలేస్తే అసలుకే మోసం వచ్చేట్టు ఉందనే చరణ్ బాబాయ్ పవర్ స్టార్ ని కలిసి సినిమాని హిట్ చేసుకునేందుకు తిప్పలు పడుతున్నాడని విశ్లేషిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

వైసీపీకి ఏబీవీ భయం – క్యాట్ ముందు హాజరు కాని ఏజీ !

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును వీలైనంతగా లేటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిన అడ్వాకేట్ జనరల్ డుమ్మా కొట్టారు. అదే కారణం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close