మేఘా కృష్ణారెడ్డికి వచ్చే ఏడాది ఏపీ ఖాజానా తాకట్టు !

మేఘా కృష్ణారెడ్డికి వచ్చే ఏడాది ఖజానాను జగన్ రెడ్డి ఇప్పటికే తాకట్టు పెట్టేశారు. ఇలా కూడా తాకట్టు పెట్టవచ్చా అని ఆర్థిక నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. కానీ నేరుగా సీఎం చెప్పారని రాసేసి.. ఆర్థిక నిపుణులు ఈ తాకట్టుపత్రాలు ఇచ్చేశారు. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇది నిజం.

మేఘాకృష్ణారెడ్డి పోలవరంతో పాటు మరికొన్నిప్రాజెక్టులు రివర్స్ టెండరింగ్ లో అతి తక్కువకు చేస్తానని టెండర్లు దక్కించుకున్నారు. ఎక్కడైనా పనులు చేస్తున్నారో లేదో ఎవరికీ తెలియదు . కానీ ఆయనకు ఠంచన్ గా నిధులు చెల్లిస్తున్నారు. వచ్చే మార్చి తర్వాత ప్రభుత్వం ఉండదు. ఎన్నికలు వస్తాయి. కానీ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడే చెల్లించడానికి ఖజానాలో డబ్బులల్లేవు. అందుకే… వచ్చే ఏడాది ఆగస్టు వరకూ… ఫలానా తేదీల్లో చెల్లిస్తామని గ్యారంటీ బాండ్లు ఇస్తున్నారు. వాటిని తీసుకెళ్లి మేఘా కృష్ణారెడ్డి బ్యాంకులో తాకట్టుపెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఆ అప్పులు కట్టాల్సింది ఏపీ ప్రభుత్వమే. వచ్చే మార్చి ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ రెండు వేల కోట్లకుపైగా మేఘా కృష్ణారెడ్డి ఏపీ ఖాజాను తాకట్టు పెట్టారన్నమాట. దీనికి ఏపీ అధికారులు రాసిచ్చారు.

ఏపీ సర్కార్ నిర్వాకం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అసుల ఏ ప్రభుత్వమైనా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. అది ఏ ఆర్థిక సంవత్సారానికి ఆ అర్థిక సంవత్సరం జరిగిపోవాలి. ఈ ఏడాది బిల్లులు మార్చి ఎండింగ్ లో పు చెల్లించకపోతే ఏప్రిల్ లో మళ్లీ కొత్త బిల్లులు పెట్టుకోవాలి. కానీ జగన్ రెడ్డి రూటే వేరు. అస్మదీయులకు తన ప్రభుత్వం పోయినా సరే వేల కోట్లు దోచి పెట్టేందుకు ఖజానాను తాకట్టు పెట్టుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఈ ప్రక్రిలో పంచుకున్నప్రతి ఒక్కరూ బాధ్యులవుతారని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి.

మార్చిలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇలా వచ్చే ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లకు ఖాజానాను తాకట్టు పెట్టడానికి ఏ మాత్రం సిగ్గుడకపోవడం జగన్ రెడ్డి స్టైల్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు బెయిల్ రద్దు కాలేదు సరి కదా సర్కార్‌కు సుప్రీం షరతు !

చంద్రబాబు జనాల్లోకి వస్తే తమ పరిస్థితి ఏమి అయిపోతుందోనని కంగారు పడిపోతున్న జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ సుప్రీంకోర్టులోనూ దాని కోసమే ప్రయత్నించారు. చంద్రబాబు రాజకీయ ర్యాలీలు, సమావేశాల్లో పాల్గొనకుండా షరతులు విధించాలని...

గెలిపించకపోతే చచ్చిపోతా : బీఆర్ఎస్ అభ్యర్థి

ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులు చివరి ప్రయత్నంగా ఆత్మహత్య చేసుకుంటామని ఓటర్లను బెదిరిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ పై పోటీ చేస్తున్న కౌశిక్ రెడ్డి చివరి ప్రయత్నంగా ఓటర్లను బెదిరించడం...

యానిమ‌ల్ మిషన్ గ‌న్ @ రూ.50 ల‌క్ష‌లు

ఈమ‌ధ్య యాక్ష‌న్ సినిమాల్లో పెద్ద పెద్ద మిష‌న్ గ‌న్‌ల‌తో హీరోలు శ‌త్రు శంహారానికి పూనుకొంటున్న సీన్లు చూస్తూనే ఉన్నాం. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, ఖైదీ, విక్ర‌మ్, మార్క్ ఆంటోనీ చిత్రాల్లో హీరోలు...
video

క‌థంతా దాచేసి.. ట్రైల‌ర్ క‌ట్ చేశారు!

https://www.youtube.com/watch?v=GnO4cOx_wFQ నితిన్ - వ‌క్కంతం వంశీ సినిమా `ఎక్ట్రా ఆర్డిన‌రీ మెన్‌` ట్రైల‌ర్ వ‌చ్చింది. ట్రైల‌ర్ అంతా స‌ర‌దా స‌ర‌దాగా సాగిపోయింది. నితిన్ లుక్ క్లాస్ గా ఉన్నా, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివ‌రీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close