ఇల్లు అంటే ప్రతి ఒక్కరికి ఓ ఆలోచన ఉంటుంది. తాము సొంత ఇల్లు కొనుగోలు చేయాలంటే ఎలా ఉండాలో ముందుగానే మనసులో డిజైన్ చేసుకుంటున్నారు యువతరం. గతంలో రిటైర్మెంట్ సమయానికి ఇల్లు కట్టుకుంటే చాలనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు. ఉద్యోగం వచ్చిన వెంటనే మంచి ఇల్లు కొనాలనుకుంటున్నారు. ఈ యువతరం ఎక్కువగా లగ్జరీ ఇళ్లనే కోరుకుంటోంది.
ముఖ్యంగా 25-40 ఏళ్ల మధ్య వయస్సు గల యువ కొనుగోలుదారులు – ఐటీ ప్రొఫెషనల్స్, స్టార్టప్ ఎంట్రెప్రెన్యూర్లు , యువ కుటుంబాలు – స్మార్ట్ హోమ్స్ , గేటెడ్ కమ్యూనిటీల వైపు బలంగా మొగ్గు చూపుతున్నారు. 2025లో ఈ ట్రెండ్ మరింత ఊపందుకుంది, ఇది రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభావితం చేస్తోంది.
హైదరాబాద్‌లో ఐటీ, ఫార్మా మరియు స్టార్టప్ రంగాల వృద్ధి కారణంగా, యువ ప్రొఫెషనల్స్ సంఖ్య గణనీయంగా పెరిగింది. వీరు సాంప్రదాయ ఇళ్లకు బదులు, టెక్నాలజీతో కూడిన స్మార్ట్ హోమ్స్ మరియు సురక్షితమైన గేటెడ్ కమ్యూనిటీలను ఎంచుకుంటున్నారు. ఆటోమేటెడ్ లైటింగ్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ సిస్టమ్స్ వంటి స్మార్ట్ ఫీచర్లతో యువతను ఆకర్షిస్తున్నాయి. నార్సింగి, కోకాపేట్, తెల్లాపూర్ వంటి ప్రాంతాలు ఈ ట్రెండ్‌కు హాట్స్పాట్లుగా మారాయి .
2025 మార్కెట్ అంచనాల ప్రకారం, స్మార్ట్ హోమ్స్ , గేటెడ్ కమ్యూనిటీల డిమాండ్ అధికంగా ఉంది,. యువ కొనుగోలుదారులు 2 BHK, 3 BHK అపార్ట్మెంట్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. యువ ప్రొఫెషనల్స్ ప్రైవసీ ,సెల్ఫ్-సఫీషియంట్ లివింగ్‌ను ఇష్టపడుతున్నారు. స్మార్ట్ హోమ్స్ IoT డివైసెస్, స్మార్ట్ సెక్యూరిటీ, ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్స్‌తో రూపొందుతున్నాయి, ఇవి స్మార్ట్‌ఫోన్ ద్వారా నియంత్రించవచ్చు. యువత ఎన్విరాన్మెంటల్ కాన్షస్‌గా ఉండటంతో, రెయిన్వాటర్ హార్వెస్టింగ్, సోలార్ పవర్ వంటి గ్రీన్ ఫీచర్లు ఆకర్షిస్తున్నాయి.