ఏపిలో రూ.85,350 కోట్లతో రోడ్ల నిర్మాణానికి కేంద్ర మంత్రి హామీ

ఈరోజు విజయవాడలోని బెంజి సర్కిల్ మరియు దుర్గ గుడి వద్ద ఫ్లై ఓవర్లకు శంఖుస్థాపన చేసిన కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కారి, ఈ కార్యక్రమానికి హాజరయిన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “విజయవాడ చుట్టూ 180 కిమీ పొడవుగల ఒక ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు. దానికి సుమారు రూ. 20,000 కోట్లు ఖర్చవుతుంది. అలాగే రాష్ట్రంలో కొత్తగా 1,350 కిమీ జాతీయ రహదారులను నిర్మించాలని కోరారు. దానికి రూ. 65,000 కోట్లు ఖర్చవుతుంది. అలాగే ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి కూడా కేంద్రప్రభుత్వం రూ.350 కోట్లు మంజూరు చేస్తోంది. ఈ ప్రతిపాదనలన్నిటికీ నేను ఆమోదం తెలుపుతున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా ముందు చూపు ఉన్న వ్యక్తి. రాష్ట్రాన్ని త్వరగా అభివృద్ధి చేసుకోవాలని తపిస్తున్నారు. పైగా ఆయన మా ప్రభుత్వానికి చాలా మంచి స్నేహితుడు. అందుకే ఆయన ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులన్నీ నేను తక్షణమే ఆమోదిస్తున్నాను. హైవేల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక పంపి, అది కేంద్రప్రభుత్వం ఆమోదించేలోగా రాష్ట్రంలో భూసేకరణ కార్యక్రమం పూర్తి చేసినట్లయితే మేము వచ్చే ఏడాది డిశంబర్ నుండి జాతీయ రహదారుల నిర్మాణం మొదలుపెట్టగలము,” అని గడ్కారీ అన్నారు.

ఈరోజు గడ్కారీ ప్రకటించినవన్నీ కలిపి చూసినట్లయితే మొత్తం రూ.85, 350 కోట్లు అయ్యింది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి నేటి వరకు రాష్ట్రానికి ఒకేసారి ఇంత భారీగా నిధులు మంజూరు చేయలేదు. ఇంకా అనేక ప్రాజెక్టులకు, ముఖ్యంగా అమరావతి నిర్మాణం, దాని పరిసర ప్రాంతాల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం మున్ముందు చాలా భారీ మొత్తాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు హైలైట్ చేసుకోగలిగితే బీజేపీ పట్ల ప్రజలలో నెలకొన్న అపోహలు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఎంతగా రెచ్చ గొట్టినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంయమనం కోల్పోకుండా కేంద్రంతో మంచిగా ఉంటూ రాష్ట్రాభివృద్ధికి అవసరమయిన నిధులు, ప్రాజెక్టులు, అనుమతులు సాధించుకోగలుగుతున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి తన ప్రసంగంలో చంద్రబాబు నాయుడు చాలా దూరదృష్టి గల వ్యక్తి…మాకు చాలా మంచి స్నేహితుడని చెప్పడానికి కారణం అదే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్: నిన్న ఐటీఐఆర్.. ఇవాళ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ..!

ఎమ్మెల్సీ ఎన్నికల పుణ్యమా అని తెలంగాణ రాజకీయాల్లో రోజుకో అంశం హైలెట్ అవుతోంది. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానం గురించి బీజేపీపై విమర్శలు చేసేటప్పుడు ఐటీఐఆర్ ప్రాజెక్టును హైలెట్ చేసిన కేటీఆర్.. వరంగల్‌కు పోయి.....

ఏపీ డీజీపీపై కేంద్ర హోంశాఖ విచారణ చేయిస్తున్న రఘురామరాజు..!

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తన నియోజకవర్గం నర్సాపురం వెళ్తే దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేయించాలని ప్లాన్ చేస్తున్నారని అనుమానిస్తున్నారు. అందుకే ఆయన ఉంటే ఢిల్లీ లేకపోతే హైదరాబాద్‌నే ఎంచుకుంటున్నారు. కానీ నర్సాపురం...

బెజవాడకు టీడీపీ హైకమాండ్ కేశినేనినే..!

బెజవాడకు తానే హైకమాండ్ అని ప్రకటించుకున్న ఎంపీ కేశినేని నాని చివరకు తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసుకుంటున్నారు. తన కుమార్తె శ్వేతను మేయర్ అభ్యర్థిగా ప్రతిపాదించారు. హైకమాండ్ ఆమోదముద్ర వేసేలా చూసుకున్నారు. తాను...

కొత్త త‌ప్పుల్ని చేస్తానేమో.. పాత‌వి రిపీట్ చేయ‌ను – రాజ్ త‌రుణ్‌తో ఇంట‌ర్వ్యూ

ద‌ర్శ‌కుడ‌వ్వాల‌నుకుని వ‌చ్చి - అనుకోకుండా హీరో అయిపోయిన వాడు రాజ్ త‌రుణ్‌. అదే త‌న‌కు బాగా క‌లిసొచ్చింది. ఉయ్యాల జంపాలా, కుమారి 21 ఎఫ్‌, సినిమా చూపిస్త మావ‌.. ఇలా హ్యాట్రిక్ సినిమాల‌తో...

HOT NEWS

[X] Close
[X] Close