హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ఈ వారంలోనే ప్రారంభమవుతాయి. నెలాఖరు వరకూ జరుగుతాయి. అయితే ఇది పబ్లిక్ చూడగలిగే కార్యక్రమం కాదు. కనీసం అందాల భామల క్యాట్ వాక్‌ను కూడా సాధారణ జనం చూడలేదు. టీవీల్లోనూ ప్రత్యక్ష ప్రసారం కాదు. అంతా ప్రైవేటు వ్యవహారంలా జరుగుతుంది. అయితే హైలైఫ్ జనాలకు మాత్రం యాక్సెస్ ఉంటుంది. వారు ఫ్యాషన్ షోలను ఎంజాయ్ చేయవచ్చు.
మిస్ వరల్డ్ పోటీలు రకరకాల థీమ్‌లతో నిర్వహిస్తారు. ఈ లోకం అంతా వేరుగా ఉంటుంది. జరిగే ప్రచారం కూడా భిన్నం. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రచారం అయితే వస్తుంది. అన్ని దేశాలకు చెందిన వారు హైదరాబాద్ కు వస్తారు. మిస్ వరల్డ్ పోటీల వెన్యూ గురించి కూడా చర్చిస్తారు. టూరిజంను ప్రమోట్ చేసుకునే ఆవకాశం ఉంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఎంతో కొంత ఖర్చు పెట్టుకుని కొన్ని సౌకర్యాలు కల్పించేందుకు నిర్ణయించింది. తెలంగాణ పర్యాటక ప్రాంతాలకు ప్రచారం ఇక్కడ కాకుండా ఇతర దేశాల్లో వచ్చేలా చూసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది.
ప్రచారం విషయం తెలంగాణ ప్రభుత్వం వెనుకబడే ఉంది. మిస్ వరల్డ్ పోటీలకు ప్రభుత్వ ధనం వినియోగిస్తున్నట్లుగా అధిక ప్రచారం జరిగితే సామాన్యుల్లో కోపం వస్తుంది. హైదరాబాద్ ను.. తెలంగాణను ప్రమోట్ చేయడానికి చేస్తున్నామని చెప్పినా సామాన్యులు దుబారా అనుకుంటారు. అందుకే గట్టిగా ప్రచారం చేసుకోలేకపోతున్నారు. మామూలుగా బీఆర్ఎస్ హయాంలో ఇలాంటి ఈవెంట్ ను ఏర్పాటు చేస్తే హైదరాబాద్ మొత్తాన్ని ముస్తాబు చేసేవారు. అలాంటి వాటికి కాంగ్రెస్ ప్రభుత్వంగా దూరంగా ఉంది. ఆ పోటీలకు వెన్యూ..సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని ప్రచారం వస్తే చాలనుకుంటోంది. ఆ పోటీల ద్వారా రాజకీయ మైలేజీ పొందాలని అనుకోవడం లేదు.