జైల్లో ఉన్న మిథున్ రెడ్డి తనకు సౌకర్యాలు కావాలని చాంతాడంత లిస్టుతో జైల్లో పిటిషన్ వేశారు. కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే అందులో ఒక దాన్ని ఎలా నేరవేర్చాలో జైలు అధికారులకు అర్థం కావడం లేదు. ఆ ఒక్కటి ఏమిటంటే మిథున్ రెడ్డికి సహాయకుడ్ని సమకూర్చడం. తనకు ఓ సహాయకుడు కూడా జైల్లో కావాలని ఆయన పిటిషన్ లో కోరాడు. దానికి కోర్టు అంగీకరించింది. కానీ ఆయనకు సహాయకుడ్ని ఎలా అనుమతించాలో జైలు అధికారులకు అర్థం కాలేదు.
అందుకే వారు నేరుగా కోర్టునే అడిగారు. సహాయకుడ్ని ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకోవడం లేదని పిటిషన్ వేశారు. సాధారణంగా జైలు రూల్స్ ప్రకారం ఖైదీలకు సహాయకుడు అనే కాన్సెప్ట్ ఉండదు. కానీ మెడికల్ పరంగా అవసరం అయితే.. జైళ్ల వైద్య సిబ్బంది నుంచి కేటాయిస్తారు. మిథున్ రెడ్డి అడిగింది మెడికల్ సహాయకుడ్ని కాదు. బయట వారిని పీఏలుగా ఖైదీలకు పంపరు. ఖైదీలను ఇతర ఖైదీలకు సహాయకులుగా పెట్టరు. మరి ఎలా ఇవ్వాలో జైలు అధికారులకు అర్థం కాలేదు.
అందుకే వారు నేరుగా కోర్టునే అడిగారు. కోర్టు .. మిథున్ రెడ్డి తరపు లాయర్లకి నోటీసులకు జారీ చేసింది. సహాయకుడ్ని ఎలా ఇవ్వాలో మీరే చెప్పండని స్పష్టం చేసింది. తదుపరి విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణలో మిథున్ రెడ్డి లాయర్లు ఏం చెబుతారో .. కానీ మిథున్ రెడ్డి జైలు సౌకర్యాల విషయంలో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు.