Click Here: Mithun Reddy Remand Report
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి మనీ ట్రయల్ మొత్తం ఆయన నిర్వాకమేనని రిమాండ్ రిపోర్టులో ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రకటించింది. మిథున్ రెడ్డి ఈ కుంభకోణంలో ప్రధాన కుట్రదారుల్లో ఒకరుగా ఉన్నారని SIT తెలిపింది. లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలు, ఆర్థిక లావాదేవీలలో కీలకంగా వ్యవహరించారని రిమాండ్ రిపోర్టులో తెలిపింది.
మిథున్ రెడ్డి రూ. 27 కోట్ల హవాలా లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాల్లో నేరుగా పాల్గొన్నారని, డొల్ల కంపెనీల ద్వారా నిధులను మళ్లించారని SIT తన రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ డబ్బు మిథున్ రెడ్డి సొంత సంస్థ అయిన PLR ప్రాజెక్ట్‌కు రూ. 15 కోట్లు, డియర్ లాజిస్టిక్స్ నుంచి రూ. 25 కోట్లు బదిలీ అయినట్లు ఆధారాలు ఉన్నాయని SIT తెలిపింది. మిథున్ రెడ్డి అధికార దుర్వినియోగం చేసి, లిక్కర్ పాలసీని మార్చడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని, ఫోర్జరీ, చీటింగ్ ద్వారా న్యాయవిరుద్ధంగా వ్యవహరించారని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
మిథున్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగి సత్య ప్రసాద్ కు నాన్-కేడర్ IAS పదోన్నతి హామీ ఇచ్చి, ఈ కుట్రను అమలు చేయించారని SIT తెలిపింది. అలాగే, సాక్ష్యాలను ధ్వంసం చేయడంలో కూడా ఆయన పాత్ర ఉందని స్పష్టం చేసింది. స్కామ్ నిధులు స్పై ఆగ్రో, శాన్ హాక్ లాబ్స్, డికార్డ్ లాజిస్టిక్స్ వంటి సంస్థలకు మళ్లించినట్లుగా ఆధారాలు సమర్పించింది. SIT ఎసిబి కోర్టుకు 28 పేజీల రిమాండ్ రిపోర్ట్ సమర్పించింది. అయితే మిథున్ రెడ్డి తనకు బ్లడ్ క్లాట్స్ వ్యాధి ఉందని, ఆసుపత్రిలో చికిత్స అవసరమని కోర్టుకు తెలిపారు. రిమండ్ కు తరలించి కస్టడీకి ఇవ్వాలని సిట్ లాయర్లు కోరారు. కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.